అమృత వర్షం

అమృత వర్షం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పిల్లి.హజరత్తయ్య

ధరల భూతం
వికటాట్టహాసం చేస్తుంటే
పేదలు దారిద్ర్యంలోకి కూరుకుపోతున్నారు
చిల్లర ద్రవ్యోల్బణం
నిప్పులు గుమ్మరిస్తుంటే
జీవితాలు చిధ్రమైపోతున్నాయి
నేలచూపులు చూసే రూపాయి
నింగిని తాకిన వస్తుసేవలతో
జనజీవనం అస్తవ్యస్తమైపోతున్నది
ధరోల్భణం సవారీ చేస్తూ
కొనుగోలు శక్తిని కబళిస్తూ
నిరుద్యోగాన్ని ఎగదోస్తున్నది
ఇంధన ధరాఘాతాలు
వ్యయాన్ని ఇంతలంతలు చేస్తూ
ప్రజల నడ్డి విరుస్తున్నాయి
వ్యాట్ బాదుడుతో
సర్కారు అలసత్వంతో
జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి
గ్యాస్ గుదిబండను
గ్రామీణులు భరించలేక
మళ్ళీ కాలుష్య బాట పడుతున్నారు
కరెంట్ కోతలు
ప్రజల వెతలను పెంచుతూ
పారిశ్రామిక ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి
జీ ఎస్ టీ అమలు సమస్యలు
పరోక్ష శుల్కాల దారుణ పోట్లు
వ్యాపారులకు అశనిపాతాలవుతున్నాయి
పన్నులను హేతుబద్ధీకరిస్తూ
ధరలకు పగ్గాలేస్తేనే
కడుపు కాలిన వారి కళ్ళల్లో
అమృత వర్షం కురుస్తుంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!