పేదరికం

పేదరికం

రచన:: జీ వీ నాయుడు

నిత్యం చూస్తుంటాం ఎందరినో
అందులో ఆకలితో ఎందరో
ఆనారోగ్యాలతో మరెందరో
ఆకలి తీర్చమని అడగలేనివారేందరో
కాలే కడుపుతో కన్నీరొలికే వారేందరో
గూడులేక చలిలో వణికే వారేందరో
పేదరికమా వదలవా మరెందరినో
పాలకులు లక్ష్యం పగటికల కారాదు
ఒకరికోసం ఒకరు కలసి కదలాలి
పారిపోదా పేదరికం మన ఐక్యత తో
చూడు సమాజ మార్పు కోసం అందరిలో
మేము సైతం అంటూ అడుగులిడితే
అంతం అవదాక్షుద్భాద మరెందరికో
నాకెందుకు అనుకుంటే వైరాగ్యమే
పేదరిక నిర్మూలన లక్ష్యం కావాలి మనందరిలో..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!