బానిస సంకెళ్లు కాదు

(అంశం:”బానిససంకెళ్లు”)

బానిస సంకెళ్లు కాదు

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

నీ భావానికి నీవు బానిసవు కాదు. సంకెళ్లు వేసుకుని బందీ కాకు. ఆవేశమే వస్తుందో, ఆలోచనే కలుగుతుందో, ఆనందమే మిగులుతుందో. ఏమైనా నీ బావాలకు నీవు ఎప్పటికి స్వేచ్చా జీవివే. అక్షరాలతో నీ బావాలను బంధించు, బహిర్గతం చెయ్యి. వచ్చేది యేమీ లేదు చైతన్యం తప్ప;

నీ జీవిత భాగస్వామిచేత సంకెళ్లు వేసుకునే బానిసవు కాదు నువ్వు. తనని నీతో కలుపుకున్న ప్రేమ బంధానివి. ఇద్దరూ యజమానులే జీవన గమనానికి. చేతులు కలపండి, మంచి గమ్యం చేరండి. వచ్చేది యేమీ లేదు, మీ సహజీవనానికి ఆనంద స్వరూపం తప్ప;

నీ తల్లిదండ్రులు నీ రక్తానికి వేసేది బానిస బంధాలు కాదు, ఆత్మీయ సంకెళ్లు. నీకు మార్గదర్శకులు. వారు నీ అభివృద్ధికి సోపానాలు. వారిని ఆదరిస్తే వచ్చేది యేమీ లేదు, వాళ్ళిచ్చిన ఆశీస్సులు తప్ప.

బానిసత్వం దరి చేరని స్నేహం మనం కోరుకునే చిలిపి చిరునవ్వుల తోడైన బంధం. మంచి స్నేహం చేస్తే వచ్చేది యేమీ లేదు అనురాగ బంధ సంకెళ్లు తప్ప;
……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!