నీకు నువ్వు తెలుసుకో

నీకు నువ్వు తెలుసుకో

రచన : సుజాత కోకిల

ఓ నేస్తమా నీవెప్పుడూ నవ్వుతూ నవ్వించాలి
కష్ట సుఖాలను ఒకే కోణంలో చూస్తూ
ధైర్యంగా ముందుకు వెళ్లి ఎదుర్కొ
నీ నవ్వు ఎప్పుడూ ధైర్యాన్ని ఇచ్చేలా ఉండాలి
నీ నవ్వు ఏడ్చేవారికి ఓదార్పు లా ఉండాలి కష్టాన్ని చూసి ఏడవకు
సుఖాన్ని చూసి పొంగిపోకు
ఎదుటి వారి కష్టాన్ని చూసి నవ్వకు
ఆ నవ్వు నలుగురిని ఓదార్చేలా ఉండాలి చేతనైతే చేయూతనివ్వు కష్టం వస్తే అక్కున చేర్చుకుని ఓదార్చు
నీ నవ్వు కష్టాన్ని మర్చేలా ఉండాలి
ఆ నవ్వు ఆపదలో ఒక సైనికుడిలా ఉండాలి
సుఖాల్లో ఆనందాన్ని పంచేలా ఉండాలి
ఎదుటి వాణీ మనసు తెలుసుకో
విసిగించి కష్టపెట్టకు అన్నీ రోజులు
ఒకేలా ఉండవు నవ్వుతూ బ్రతకాలి
నలుగురి మేలు కోరుతూ చావాలి
ఆ నలుగురే మనల్ని తలుచుకుంటూ బ్రతకాలి
జీవితం అంటే ఇదే..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!