తప్పెవరిది?

తప్పెవరిది?
                              (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)           

రచన: ఎస్.ఎల్. రాజేష్

           ఎప్పటిలాగే నా హాస్పిటల్ లో పేషెంట్లను చూస్తున్నా. కోవిడ్ ప్రభావం వల్ల ఏమో తెలీదు ఇంకా జనం లో భయం తాలూకు ఛాయలు పోలేదు. అంతలో సిస్టర్ వచ్చి ” సార్ ఇంజురీ కేస్ వచ్చింది” అని చెప్పింది. లోపలికి తీసుకురమ్మన్నాను. ఓ 40 ఏళ్ల మహిళను తీసుకుని వచ్చారు. ఒళ్ళంతా కమిలిపోయి ఉంది. తల పై బలమైన గాయం తగిలిందేమో రక్తస్రావం అవుతుంది. వెంటనే ఆమెను పరీక్షించాను. తల మీద పెద్ద దెబ్బ తగిలింది. కుట్లు పడతాయి. “ఏమైందని” ఆమె భర్త ను అడిగాను. కింద పడిపోయింది అన్నాడు. నాకు ఎందుకో అనుమానం వచ్చింది. “ఇంత బలంగా గాయాలు ఉంటే క్రిమినల్ కేస్ అవుతుంది. నిజం చెప్పు అని గద్దించాను. అతనే కొట్టి ఉంటాడని. ” డాక్టర్ గారు  నిజం చెప్తా. మా అబ్బాయి ఇనుప రాడ్ తో కొట్టాడండి. తాగి వచ్చి అల్లరి పెడుతున్నాడని మందలించింది మా ఆవిడ. అంతే ఇష్టం వచ్చినట్టు కొట్టాడు” కన్నీరు పెట్టుకుంటూ బోరుమన్నాడు.
అంతలో సిస్టర్ స్టిచేస్ కి కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి కుట్లు వేసాను. 9 కుట్లు పడ్డాయి. ఆమె అలా నిశ్చలంగా చూస్తోంది. కొంచెంసేపు పడుకోమని చెప్పి అతని దగ్గరకు వచ్చి “ఏం జరిగింది, మీ వాడికి ఎన్నేళ్ళు ఉంటాయి” అడిగా. నేను నా భార్య లక్ష్మి ఇద్దరం పనికి వెళ్తాం. లేక లేక పుట్టాడు అబ్బాయి అని గారాబంగా పెంచాం. అడిగిందల్లా తాహతు కు మించి ఇచ్చాం. మా బాధలు వీడు పడకూడదు అని ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జాయిన్ చేశాం. టెన్త్ వరకు ఎలాగోలా నెట్టుకొచ్చి ఇక చదవను అని మొండికేసాడు. నేను మందలించి నప్పుడల్లా మా ఆవిడ వాణ్ణి వెనకేసుకొచ్చేది. ఇప్పుడు చదువు సంధ్యా లేక ఫ్రెండ్స్ తో తాగడం, నన్నూ వాళ్ళమ్మను కొట్టడం చేస్తున్నాడు” అలా చెప్పుకుంటూ పోతున్నాడు.
నేను ఆలోచన లో పడ్డా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!