అంశం: హాస్య కవిత
సంకల్పమే లేదే..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: జీ వీ నాయుడు
ఎగరాలని ఉంది ఆకాశానికి
ఎలా సాధ్యం రెక్కలు లేవే
ఈదాలని ఉంది బంగాళాఖాతాన్ని
ఈత నేర్పే వారే లేరే
కోకిలలా పాడాలని ఉంది
కాకి అరుపును మాన లేనే
గుర్రం ఫై స్వారీ చేయాలని ఉంది
ఎక్కేందుకు కాళ్ళే లేవే
ఏకంగా ప్రధాని కావాలి అని ఉంది
దేశ పౌరసత్వమే లేదే
మోతు బర్రు రైతును కావాలని ఉంది
సెంటు భూమే లేదే
అన్నీ సాధించాలని ఉంది
ఎలా సాధ్యం అసలు సంకల్పమే లేదే
అందుకే ఇది అయింది
హాస్య కవితా మధురమే