నిరీక్షణ ఇంకెంత కాలం

నిరీక్షణ ఇంకెంత కాలం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జీ వీ నాయుడు

ఇంకెంత కాలం కులమతాల గోల
సామారస్యం ఎక్కడా
చూద్దాం అన్నా కనబడని వేళ
అత్యాచారాలు   ఆరాచకాలు
అసాంఘిక కార్యక్రమాలు
అధికం అవుతున్న వేళ
ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు
ఓటరు మహాశయులకు
ఎన్నెన్నో తాయిలాలు ఇస్తున్న వేళ
ప్రజాస్వామ్య దేశం లో
మానవతా విలువలు
సాకారం అయ్యే వేళ
ఎప్పుడు వస్తుందో ఈ దేశం లో
తరాలు మారుతున్నా మారని తలరాతలు
ఎంత కాలం ఎంత కాలం
ఈ మానవతా విలువల కోసం
నిరీక్షణ ఇంకెంత కాలం….?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!