ఐక్యతా మతం

ఐక్యతా మతం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లోడె రాములు

మతతత్వమే తెలియని నాదేశం
ఆధునిక పాలకులే రగిల్చారు మత విద్వేషం
పన్నెండు శతాబ్దాలు కల్సిమెల్సి ఉన్నాం
శత్రుత్వమే లేని మతాలు మావి
రాజకీయ భావాజాలమే మత తత్వం
బ్రిటిష్ వారు పన్నిన కుట్రలో భాగం
వినాశకరమైన రెండు దేశాల ప్రతి పాదన
కొంతమంది మత వాదుల స్వార్థం
వలసవాద రచయితలచే ప్రచారం
భారతీయచరిత్ర మతవాదుల చేతిలో వక్రీకరణం
రాజకీయ ఏజండాకు  విస్తృత ప్రచారం
మనమే బ్రిటిష్ వారికి అవకాశం ఇచ్చాం
వివాదాలు విభేదాలు లేని మతాలు
ఎవరి మతం వారికి ఉన్నతం
సున్నితమైన లక్ష్యాల కలయికే మతం
మేం భారతీయులం అన్నదే దేశ
మతాల నినాదం
మతంలో ఉన్న అంతర్లీన ఆలోచన
ప్రాధమిక ఐక్యత
మతాల ముసుగులో స్వార్ధ
భావాలను
వ్యాప్తి చేసుకోవడమే అనర్ధాలకు దారి
మనం మాత్రం ఐక్యతా మతం పాటిద్దాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!