స్థిత ప్రజ్ఞ

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

స్థిత ప్రజ్ఞ 

రచన: నారుమంచి వాణి ప్రభాకరి


కారు రివ్వున హైవే పై వెడుతోంది ఏ సి కారు చల్లని గాలి రివ్వున తాకుతోంటే ఎంత హాయి నాన్న రామం ఒక్ పెద్ద కంపెనీ లో ఆడిటర్ పొలాలు ఇల్లు పల్లెలో ఉన్నాయి . పిల్లలు నలుగురిని తీసుకుని అప్పుడప్పుడు పల్లె అందాలు చూపిస్తాడు. అక్కడి ఆప్యాయతలు అన్ని పిల్లలకి అలవాటు చేశాడు. పిల్లలు ఎదిగే కొద్ది చదువుల కోసం విజయవాడ వచ్చాడు.

ముగ్గు రు మగపిల్లలు సిక్స్త్ సేవెంత్ ఏయిత్. వాళ్ళని మంచి ఇంగ్లీష్ కాన్వెంట్ లో చేర్పించాడు ఆడపిల్ల హరిణినీ మాత్రం ఆడపిల్లల స్కూల్లో చేర్పించాడు ఆ డపిల్ల టెన్త్ కివచ్చింది. ఎవరి భయాలు బెంగ లు వారివి స్కూల్ పూర్తి టైమ్ కి ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి గేటు దగ్గర ఉండేవారు వాళ్ళతో కలిసి రిక్షాలో వచ్చేది. నాన్న మాత్రం స్కూల్ కి కార్ లో దింపేసి వెళ్ళేవారు

కాలం గడిచింది డిగ్రీ అవగానే అత్తింటికి పంపాలి అనుకుంటే ఒక్క మంచి సంబంధం దొరక లేదు పిజి చేస్తాను నాన్న గారు ఆన్నది సరే అని చేరింది. సంభంధాలు వస్తున్నాయి పోతున్నాయి పిజి పిల్ల వద్దు వండి పెట్టదు అని ముద్ర వేశారు. ఒక సంబంధం వచ్చింది బ్యాంక్ పి ఓ ఒక్కడే కొడుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు వాళ్ళు కూడా ఉద్యోగస్తులు ఎల్ ఐ సి ఒకరు ఒకరు ప్రైవేట్ బ్యాంక్ ఇంకోకామే టీచర్ ముగ్గురు విజయవాడలో వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు
ఆదివారం వచ్చిందంటే సంద డే సందడి గా ఉంటుంది మా  ఇల్లు అని గొప్పగా చెప్పారు ముందు పిజి పిల్ల.వద్దు అన్నారు ఆ తరువాత మూడు నెలలకి వాళ్ళే మద్య వర్తిని పంపి పెళ్లి. కుదుర్చుకొన్నారు
ఒక్కగా నొక్క పిల్ల బంగారం వెండి ఘన మైనా అత్త లాంఛనాలు ఆడ బడుచులుకి కాసు బొట్టు పెట్టాలి అని చెప్పారు 25 వేల పట్టు చీరలు పట్టాలి అన్నారు మధ్య వెర్తి మీరేమి పెడతారు
అంటే వాళ్ళు పెట్టేది వాళ్ళ పిల్లకేగా వేరే ఏమీ పెట్టము రెండు చీరలు ఒక కాసు నల్ల పూసలు అన్నారు
క్యాష్ మాత్రం ఎక్కువ అడిగారు మేము అంతా ఇవ్వలేమని వదిలేశారు కానీ బంగారు పిట్ట వదులుతార రెండేళ్లు వెంటపడ్డారుఫోన్ లు చెయ్యడం అత్త అడబిడ్డలు పండగ శుభా కాంక్షలు
ఎంతో ప్రేమ ఉన్నట్లు మాటలు మీ పుట్టంటి కన్నా బాగా చూస్తాము ఊళ్ళో నే కనుక నువ్వు చూడ వచ్చు అని చెప్పారుఇంత బాగా ఎవరు ఉంటారు అయితే అయ్యింది చేద్దాము అనే స్థితికి తీసుకువచ్చి గొప్పలు చెప్పారు సరే పిల్ల నెమ్మది మంచి సంబంధం ఒక్క కొడుకు అని ఆశా పడ్డారు పెళ్లి తరువాత వారి అసలు గుణం తెలిసింది. ఏదైనా కానీ దిగితే కానీ లోతు తెలియదు
బ్యాంక్ నుంచి ఎప్పుడూ పదికి వచ్చే వాడు అతనికి భార్య అన్నం పెట్ట కూడదు అత్తగారు వద్దు నువ్వు పెట్ట వద్దు వాడికి తగిన తిండి కుదరదు అన్నది. ఏమిటా అని చూస్తే ఇంట్లో వాడికి మాగాయ ఆవకాయ గోంగూర పచ్చడి కంది పొడి ఇవి వేసి పెడుతుంది అతని కస్తంతో అయిల్లు గడుస్తోంది. సాయంత్రం ఆఫీస్ నుంచి రెండో ఆడబడుచు మూడవ అడవడుచు తను వండిన కిలోన్నర కూర సర్దుకు వెళ్ళి పోయేవారు మిగిలితే తను తినేది భర్తకి సెడ తాను అంటే వద్దు వాడు కంది పొడి ఇష్టం గా తింటాడు అని చెప్పేది.రెండో పూట వంట వండకూడదు గ్యాస్. ఆదా చెయ్యాలి. ఇంట్లో ఏ సి వెయ్య కూడదు. కూలర్ పెట్టుకుని బ్రతకాలి, అది అత్తగారే పెట్టుకుంటుంది.మామ గారు ఊరుకి ఉపన్యాసాలు చెపుతాడు కానీ పెళ్ళానికి చెప్పలేడు
ఒక ఏడాది గడిచింది తల్లి తండ్రికి చెపితే వినరు నీకు ఉండటం రాదు వందటమే గాని అని విసుగు కునేవారు. నాకొడుక్కి చద్దు అన్నమే ఇష్టం చిన్నప్పడు మా అమ్మ వాడికి
చద్ది అన్నం అలవాటు చేసింది అనిచెప్పి వారు. ఆదివారం వస్తె ఛాలూ ఇల్లంతా గందరగోళం మొగుడు రాజేష్ ఏమి పట్టించుకునే వాడు కాదు
ఒక రోజు అజీర్ణం వల్ల ఆరోగ్యం బాగా లేదు లేవలేక పోయింది

ఏమిటి ?అప్పుడే కడుపా ఇప్పుడప్పుడే పిల్లల్ని కన వద్దు అని చెప్పింది. పెద్దడ పడుచు వచ్చి ఎందుకంటే ఇప్పటి నుంచి పిల్లల బాధ్యత ఎందుకు?

అసలు అజీర్ణం. తిండికి రోగం వస్తె అయ్యో లేచావా అని లేదు కానీ రక రకాల వేటకారం మొదలు పెట్టారు

భర్త ఆరోగ్యం సరుగా లేదు ఎక్కడైనా చూపించండి అంటే వాడికి మొదటి నుంచి అజీర్ణ వాతం అని ఓ అర్ ఎంపి తెచ్చి మందు వేసి మజ్జిగ పట్టించింది అప్పుడు కూడా దగ్గరికి రానివ్వలేదు అత్తగారు స్వార్ధానికి హరిణి బాధ పడింది తండ్రి కి చెపితే అంతా వచ్చి చూశారు.

మీ పిల్లను మీరు తీసుకు వెళ్ళండి వాడి సంగతి అనవసం అని చెప్పారు ఇద్దరికీ ఏ విధమైన అనుబంధం లేదు పెళ్లి అయ్యి ఏడాది కాలేదు అన్ని బాధలే.

ఆషాఢ మాసం లో కూడా పుట్టింటికి పంపలేదు సరికదా ఆషాఢ. పట్టి నాలుగు కాసుల గొలుసు కాసు ఉంగరం పెట్టండి అన్నాడు మీరు శ్రావణ తగువు ఏమి తెస్తారు అంటే మాకు అనమాయితి లేదు అని నిక్కచ్చిగా చెప్పారు మొండి వాడు రాజు కన్నా బలవంతుడు అన్న సామెత లా ఉన్నది.
రెండు నెలలు గడిచాయి కొడుకు చేత కాగితాలు కలాల రాయించుకున్నారు జ్వరం వచ్చి తన దారి తాను చూసుకున్నాడురాజేష్ చాలా బాధ పడేవాడు ఏనాడు పెళ్ళాంతో మాట్లాడనివ్వ లేదు పిల్లల్ని పుట్టించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు తిండి సరిగా పెట్టక హోటల్స్ తిండి కి ఆరోగ్యం పాడు అయింది

నాకుతురు నాకు బరువు కాదు అని పీహెచ్ డీ లో చేర్పించారు తెలివైన హరిణి డాక్టర్ హరిణి గా మారింది ఒక పెద్ద పేపర్ ఆఫీస్ కి తన పరిశోధన గ్రంధం తీసుకుని వెడితే ఆ ఏడిటర్
మా ఆఫీసులో స్టాఫ్ తక్కువ ఉన్నారు మీరు బాగా చదువు కున్నారు ఉద్యోగం ఇస్తా చెయ్యండి అన్నాడు.ఉద్యోగానికి పంపడానికి తండ్రి ఒప్పుకోలేదు అందులో ఎందరో మోస గాళ్లు ఉంటారు
అని బాధపడ్డాడు ఎలాగో తమ్ముళ్ళు వప్పించి ఉద్యోగంలో చేర్చారు ఓ ఇరవై ఏళ్ళు భాగానే గడిచింది ఏముంది
తల్లి వెనకాల వంట చేసి క్యారేజ్ సర్దుకుని వెడుతుంది.అత్తింటి సంబంధం లేదు సడెన్గా గా అన్ని ఆఫీసులు మూత బడటం తో మళ్లీ జీవితంలో సమస్యలు ఫుల్ టైమ్ వంటలో వచ్చింది అక్క నువ్వు బ్యాగ్ వండుట వచ్చు మా ఆవిడకు రాదు అని తమ్ముళ్ళు కి స్వార్థం లేక పోయినా.మరదలికి స్వార్థం.వచ్చింది మరో అఫీస్ కి ఉద్యోగానికి వెడితే పెద్ద చదువు.జీతం తక్కువ ఉంటుది అన్నారు అయినా వర్క్ ఫ్రమ్ హోమ్మ్ అని ఆశా పడి చేస్తే జీతం ఇవ్వమన్నారు ఇంకో పెద్ద సంస్థ లో ఆప్ గితే అందరికీ లక్ష యాబై వెలు పెంక్షన్ వస్తుంది కానీ మీరు ఫ్రీ సర్వీస్ చెయ్యాలి అని చెప్పి పంపారు

హరిణి విసిగి పోయింది అమ్మ నాన్న నేను ప్రశాంతంగా మన పల్లె ఇంట్లో చిన్న టుషన్ సెంటర్ పెడతాను నేను మీ.దగ్గర కూడా ఉండలేను అని చెప్పింది . వద్దు మేము వస్తాము కావాలంటే మీ తమ్ముళ్ళ దగ్గర మీ అమ్మ ఉంటుది అని చెప్పాడు అల్లారు ముద్దుగా పెంచిన కూతురు జీవితం పెళ్లితో మహా కష్టాలు వచ్చాయి నా నాటి బ్రతుకు నాటకము అన్ని పాట ఎక్కడి నుంచో విని పిస్తోంది శ్రీ అన్న మయ్య సాహిత్యము శ్రీవేంకటేశ్వరుడు.కీర్తనలు మనిషి జీవితాన్ని మంచి మలుపు తిప్పుతూ ఉంటాయి

కారు హైవే మీద మెత్తగా పొలాల మధ్య నుంచి వెడుతుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!