యువర్ మై హీరో రా

(అంశం : నా అల్లరి నేస్తం)                                                               యువర్ మై హీరో రా

రచన :: ఎన్.ధన లక్ష్మి

నిన్ను కలిసే దాక నాకు తెలీదు
నేను అల్లరి చేస్తాను అని …
నీతో మాట్లాడే వరకు నాకు తెలీదు
నాలోనూ పసితనం ఉంది అని ..
నువ్వు అలక చంద్రుడివి నిన్ను తప్ప
ఇంకా ఎవరిని నేను పొగడకూడదు …
నాతో పోట్లాడతావు నాతో మాట్లాడం మానివేస్తావు
నేను ఏమి చెప్పిన వింటావు. ఏమి చెప్పిన చేస్తావు
నీతో ఉంటే చాలు నన్ను నేను మర్చిపోతాను …
నీతో ఆటలాడితే చాలు నా కష్టాన్ని కూడా క్షణంలో మర్చిపోతాను …
నీ భుజాలు పట్టుకొని నేను పడుకున్న రోజు అసలైన ఆనందం ఏంటో తెలిసింది …
నువ్వో మాటల మాంత్రికుడివి నాలో కోపాన్ని కూడా
నీ మాటల మాయాజాలంతో తగ్గిపోయేలా చేస్తావు
నీతో ఉంటే నేను కూడా చిన్నపిల్లలాగా అల్లరి చేస్తాను …
ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు ,కోరికలు ఒకటే
నా చిన్నారి అల్లరి నేస్తానివి నువ్వు
అందానికి,అల్లరికి చిరునామా నువ్వు
కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన మనసు నీ సొంతం.
అల్లరి లో చిన్న కృష్ణయ్య,గుణంలో రాముడు….
రోజు సరికొత్తగా నువ్వు చేసే పనులు, నీ చేష్టలు నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఉన్నాయి…
నీ నోటా వచ్చే ప్రతి అక్షరం
నాలో ఉత్సాహాన్ని నింపుతుంది….
“మనం ఇద్దరం ఒకేలాంటి వాళ్లము అందుకే మన ఇద్దరిలోకం ఒకటే ”
శశిధర్ అలియాస్ బిట్టు ..యు అర్ మై హీరో రా!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!