(అంశం : నా అల్లరి నేస్తం) ఓ నేస్తమా
రచన :: ధనాశి ఉషారాణి
ఓ ప్రియ నేస్తమా
నీవుంటే నాకు వెన్నెల పంటవి
నీవు నా ముందు ఉంటే కష్టాలు కరిగిపోవును
నా కంటి పాపవుగా
నా గుండెల్లో సంతోష పరిమళాలు పూచును
ఎవ్వరూ లేని వేళ నాకు తోడై నిలిచి నన్ను మురిపించుదువు
నా కన్నా ముందుగా నా విజయదారిని వెతికి
నాకు మహోన్నత స్థాయిని ఇచ్చేవు
చిలిపి మాటలతో నన్ను ముస్తాబు చేసేవు
నా గుండెల్లోన ఎంతో మనోధైర్యాన్ని నింపేవు
మాటలతో మాయజేసి మనసును మురిపించేవు
నా గురించి అందరికీ గొప్ప అనుభూతిని పంచేవు
గుండెల్లోని నిరాశను నిలువునా చీల్చేసి
నన్ను ఉన్నత స్థాయికి చేర్చేవు
స్వేచ్ఛమైన ప్రేమతో నిస్వార్థంగా నన్ను తలిచి నిజమైన ప్రేమను పంచేవు
నీకు సాటిలేరు నేస్తమా
నీవేనా అసలైన అల్లరి నేస్తానివి