భావ తరంగాలు

(అంశం : నా అల్లరి నేస్తం)                                                              భావ తరంగాలు

రచన :: నెల్లుట్ల సునీత

తోబుట్టువు తోడు లాగా
నాతోనే ఉంటూ
దిగాలు పడినప్పుడు
చైతన్యశక్తిని నింపి
హాస్య కుసుమాలు పూయించి
ఆనందపరచిన ఉత్తేజ పరిమళాలు అందించే నీ అల్లరి జ్ఞాపకాలు నా దివ్యతేజా రూపాలు

సృష్టిలోనే గొప్పదైన
మన స్నేహ బంధం
మధుర స్మృతుల
తాయిలాలు ఒలికిస్తూ
హృది తంత్రులు
మీటిన భావతరంగాలుగా
నా మస్తిష్కంలో నిక్షిప్తమైన
ఉషో గీతీకల రాగాలేవో
ఆలపిస్తూన్నాయి నేస్తం

స్నేహ స్పర్శ ఎదలో
కదిలిన భావాల స్పందనలు
ఉదయ సమీరంలా
తాకిన స్మృతులు
కాలగర్భంలో నడుస్తూనే ఉన్నవి

నిరాసక్తిగా ఏ లక్ష్యాలను చేరుకోలేనప్పుడు
జీవిత విలువల సారం నింపి
వంతెన లు వేసిన
సారథిగా ఎప్పుడు గుర్తొస్తావు

ఆశా గీతం పాడుతూ
ఆశయ పథం లో సాగుతున్న
నీ అల్లరి జ్ఞాపకాలు
నా ఆత్మ విశ్వాసం వెలుగులో
ఎప్పుడూ నా వెంటే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!