చరవాణి

చరవాణి

అంశం : నిన్ను దాటి పోగలనా

 

నా ప్రపంచమే వేరు నిన్ను చూసే క్షణం వరకు
నా లోకమే వేరు నిన్ను చూసే నిమిషం వరకు
ప్రతి క్షణం నీ ఊహల్లోనే విహరిస్తున్న
కనులు తెరిచిన క్షణం నుంచి కనులు మూసి నిద్రలోకి జారే మరు నిముషము వరకు నువ్వే నా ప్రాణo
నువ్వే నా వారిధివి ,నువ్వే నా ప్రియా శత్రువువి ..
నువ్వే నా బాటసారివి , నువ్వే నా స్ఫూర్తివి ..
నువ్వే నన్ను నిద్రలేపు సూర్యుడివి ..
నన్ను నిద్రలోకి జారుకునే లాగా చేసే చంద్రుడివి
నాకు  తెలియని నేస్తాలకు నన్ను పరిచయం చేసిన
అనుసంధాన కర్తవి నువ్వు…
కలలో అయిన నిన్ను దాటి పోగలనా సాధ్యం అవునా
నాలో దాగిన కలను , నాలో భావాలను
నాకు తెలియని విద్యను , విషయాలను నేర్పు గురువువి ..
దారి తెలియని నాకు మార్గాన్ని చూపించే మార్గదర్శివి
బాధ అయినా సంతోషమైన పంచుకునే ఆత్మీయురాలివి
నా కోపాన్ని భరించే బంధాన్నివి నువ్వు..క్షణం కూడా నిన్ను వీడి నేను ఉండలేను…

రచయిత ::  ధన

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!