వినాయక పూజ

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

వినాయక పూజ

రచన:యాంబాకం

అమ్మా నాకు ఒక కథ చెప్పవా!అని మారం చేసాడు, బుజ్జిగాడు వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి.బుజ్జిగాడు అమ్మ కొడుకును చేరదీస్తు రేపు పండగ కదా నాకు బోలెడు పనులు ఉన్నాయి బుజ్జి ,మీ నాన ను అడుగు పో అని చెప్పి ,పనిలోకి వెళ్లి పోయింది. బుజ్జిగాడు మూతి ముడుచుకొని వెల్లడం చూసిన బుజ్జిగాడి అమ్మమ్మ బుజ్జి ఏమిరా!అలా ఉన్నావు ?అని అడిగింది అమ్మమ్మ ప్రేమగా బుజ్జిగాడిని.కథ చేప్పమంటే అమ్మ నాన తో చెప్పించుకోమని లోపలకి వెళ్ళింది అమ్మమ్మ అనిచెప్పాడు. బుజ్జి దానికా అలిగావు అని అమ్మమ్మ నేను చెప్పనా! అంది అమ్మమ్మ. బుజ్జిగాడు ఎగిరి గంతేసి చెప్పు చెప్పవు అని మరల మారాం చేయడం మొదలు పెట్టాడు. తరువాత బుజ్జిగాడి అమ్మమ్మ ఇలా కథ చెప్పడం ఆరంభించింది …
రోజులాగానే రావణాసుని భార్యా మండోదరి కాళికాదేవి పూజలు నిర్వహించి గుడి నుంచి ఇంటికి పోతున్న సమయంలో ఆకాశవాణి ఇలాపలికింది ఓ మహారాణి!నీకు తగదు ,నీ భర్త కోసం నీవు చేయు పూజలు పని చేయవు .పుట్టిన ప్రతి జీవి ఎదో ఒకరోజు మరణించక తప్పదు, అని పలికి అదృశ్యం అయిపోయింది. అప్పటి నుంచి మండోదరి నలతగా మారిపోయింది. నలతగా అంటే ఎంది అమ్మమ్మ అని అడిగాడు బుజ్జి అదే ఇందాక నీవు ఉన్నావే అలా అని నవ్వింది. అమ్మమ్మ ఇంతలో బుజ్జి తరువాత ఎమైంది కథ అన్నాడు .అమ్మమ్మతో సరె తరువాత మండోదరి వారి ఆస్థాన పండితుడుని పిలిచి తన భర్త అయిన రావణుడికి తెలియకుండా ఆకాశవాణి పలికిన పలుకులు పండితుడికి చెప్పి దీనిలోని మర్మము ఏమిటో వివరించాలని అడిగింది మండోదరి. పండితుడు మహరాణి కి నమస్కరించి ఆకాశవాణి చెప్పింది వాస్తవమే కానీ, మీరు ఆందోళ చెందటటానికి గల కారణం మాకు భోదపడక అర్థం కావడం లేదు మహారాణి మండోదరి అన్నాడు.అప్పుడు తన మనస్సులోని మాటను పండితునికి ఇలా చెప్పింది. నాభర్త కి కూడా మరణం ఉందా !అంటూ దుఃఖించటం మొదలు పెట్టింది. పండితుడు అంజనం వేసి రాబోయే కాలంలో భూలోకం లో ఒక మహారాజుకు ఒక తేజో మూర్తి జన్మించి తమ భర్త అయిన రావణప్రభువు ను
హతమారస్తాడని అంజనం చూపిస్తుందనీ ఇదే ఆకాశవాణి చెప్పినమాటలు అన్నాడు పండితుడు. ఇది అప్పుడే అటువైపు నుంచి వచ్చిన రావణుడు విని పట్టరాని కోపంతో “ఏమిటీ మా పితృదేవుడైన బ్రహ్మ దేవుడే స్వయంగా ఇచ్చిన వరం అబద్ధమా! గర్జించి ఉపాయం “అన్నాడు రావణుడు.
వెంటనే మండోదరి తన భర్త ను ఎదురు మాట్లాడక ఏమి చేయబోతున్నడో అని అలోచించసాగింది.అంతలో రావణుడు బిగ్గరగా ఆరాజు ఎవరో వాడని చంపివేస్తాను ఇంక వాడికి సంతానం వల్ల నాకు చావు తప్పు తుంది అని మనసులో అనుకుంటూ కొంత మంది సైనికులను పిలిచి సైనుకులార ఒక తేజోమూర్తి ఒక మహారాజు దంపతులకు జన్మిస్తారంటా వారి వలన మాకు మరణం అంట కావున మీరంత నగరంలోనికి పోయి ఆరాజు ఎవరు ఆకాశవాణి పలుకులకు అర్థం ఏమిటో? తెలుసుకొని రండి అని సైనికుల ను శాసించాడు.
కొంతకాలం తరువాత సైనికులు తిరిగి వచ్చి ఎదో చెప్పబోవు సమయానికి, నారదుడు వచ్చి రావణబ్రహ్మ ,అని సంభోదించి పలకరించుకొంటూ రావణా! ఏదో ఆందోళనచెందుతున్నట్లు గా కనిపించు చున్నావే ,అని ప్రశ్నించగా రావణుడు అవును మునీంద్ర ఎవడో “రాజ అట వారికి పుట్టబోవు కొడుకు నన్ను చంపుతాడట” వాడెవడో నాకంట పడితే! కాదు కాదు వాడిని అంతకన్నా ముందే నేను చంపదలచాను. మీరు త్రిలోక సంచారులు కదా! ఆ రాజు ఎవరో తెలిసిన యెడల మా చెవిన వేయ ప్రార్ధన అని రావణుడు తెలుపగా, నారదుడు అవును రావణా నీకు మానవుని చేతిలో మరణం ఉన్నది ఆరోజు బ్రహ్మ దేవుడు వరము ఇచ్చునప్పుడు నీవు మానవులను వానరులను వదలి మిగిలిన వారు నుండి మరణం లేని వరాన్ని పొందినావు దాని ప్రభావం వల్ల పుడమి మీద దశరధుడు అనే రాజుకు కౌసల్య ,సుమిత్రకైకేయి లతో కలిగే సంతానము వలన అందులో మొదటి సంతానం వల్ల నీకు కీడుకలదు అని చెప్పి సెలవు తీసుకుని వైకుంఠం వైపు వెల్లసాగాడు నారదడు.
నారదుడు చెప్పగానే సైనికులతో దశరధుడుఎక్కడ ఉన్నాసంహరించడానికి బయలుదేరినాడు అలా పోతున్నా రావణుడికి ఒక సముద్రంలో ఒక అద్భుతమైన పడవ కనిపంచగా ఎవరిది? ఈ పడవ ప్రశ్ననంచగా అందులో దశరధుడనే రాజు పెళ్లికి తరలి వెళ్ళుతున్నాడని తెలిసి తన సేనలతో పడవలోని వారిని సముద్రంలోనే హతమార్చండి, ఆరగించమని ఆజ్ఞాపించి ఆ పడవ లో పెళ్లి కుమార్తె ల అలంకరణ లో ఉన్న రాకుమార్తెలైన కౌసల్య, సుమిత్ర,కైకేయిలను పెండ్లి ఆడదలచి అపహరించి, లంకకు తీసుకుని పోగా అప్పుడే అటు వచ్చిన నారదుడు చూసి రావణాసుర వీరి వలన నీకు వచ్చిన చింత ఏల? వారి సంతానం వలనే కదా నీకు కీడు వీరిని పెళ్ళి ఆడటం ఎమిటి వీరిని సంహరించు అని చెప్పగా రావణుడు ఇది నిజమే అని గ్రహించి వారి సైనికుడైన రాక్షసున్ని పిలిచి ఆ ముగ్గురి రాకుమార్తెలను చంపమని చెప్పి, వాళ్ళ పీడ వదిలింది అని తలచి ఇంక తనకు కీడు లెదని తలచి తన విలాసమందిరానికి వెళ్లి పోయాడు.ఆ రాక్షసుడు పెళ్లి కుమార్తె లైన కౌసల్యా, సుమిత్ర,కైకేయిలను తన పొట్టలో దాచి హాయిగా నిద్రపో సాగాడు.
దశరధుడు తనకు వచ్చిన ఆపదను తలచుకొని ఆ. సముద్రములో మునిగి పొతుండ సముద్రుడు కాపాడి తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని దశరధ మహారాజా నీకు వచ్చిన ఆపదను విఘ్నములు తొలగి వివాహం జరగవలన్న నీవు విఘ్నేశ్వరుడు ని తలచి పూజించిన నీకష్టములు తీరి మీరు తలపెట్టిన కార్యములు జరుగును, అని సముద్రుడు హితవు పలకగా దశరధుడు సరేయని”వినాయకపూజ”చేయసాగాడు దశరధుడు భక్తి శ్రద్దలతో సముద్రుని సహాయంతో”వినాయకపూజ”పూర్తిచేయగా వినాయకుడు కైలాసం నుండి గమనించిన వాడై జరిగినది తెలుసుకొని రావణ సంహారం జరగాలన్న దశరధునికి కౌసల్య సుమిత్ర కైకేయి ల రాకుమార్తెలతోపెండ్లి జరగాలని వినాయకుడు తలచి దిగివచ్చి రాక్షసుడి పొట్ట లో ఉన్న రాకుమార్తెలతో పాటు దశరధుడను కాపాడి వారికి పెట్టిన ముహూర్తనికే పెండ్లి చేసి వారిని అయోధ్యకి చేర్చాడు,వినాయకుడు.వేంటనే బుజ్జిగాడు శ్రీరాముడు పుట్టి రావణుడను చంపేరా అమ్మమ్మ అని అడిగాడు.అవును రా అంది అమ్మమ్మ.
“అమ్మమ్మ చెప్పిన కథ”విని బుజ్జి చాలసంతోషంగా “వినాయకపూజ”భక్తిగా చేసాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!