ఆదర్శం

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

ఆదర్శం

రచన:జీ వీ నాయుడు

ఒక ఊళ్ళో ఒక బడి పంతులు ఉండే వారట. ఆయన పేరు రామబ్రహ్మం. అయన ప్రతి రోజు ఉదయం నిద్ర లేవడం ఊళ్ళో అన్ని వీధుల్లో తిరిగి వారి పిల్లలు ఎలా ప్రయోజకులు అవుతారో, అందుకు తల్లిదండ్రులు ఏమీ చెయ్యాలో వివరించే వారు.
నిత్యం గ్రామంలో తిరిగి అందర్నీ బడికి తీసుకెళ్లి కూర్చో పెట్టు కుని
విద్యాబుద్దులు నేర్పే వారు. కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను బడికి పంపకుండా వ్యవసాయపనుల కోసం పంపే వారు.
ఆ ఉపాధ్యాయుడు బడికి రాని వారి ఇండ్లకు వెళ్లి, వారి బిడ్డ లను ఎలా పెంచాలో వివరించి, పిల్లలు చదువును ఆటంక పరిస్తే కలిగే అనర్ధాలు తల్లిదండ్రులు అర్ధం చేసుకునే లా వివరించే వారు.
ఐదవ తరగతి పూర్తి చేసిన బాలబాలికలను సమీపంలో ని పట్టణానికి పంపి చదివించేందుకు తల్లిదండ్రులు ఇష్ట పడేవారు కాదు. ముఖ్యం గా ఆడపిల్లలకు చదువు ఎందుకు అని తల్లిదండ్రులు వాధించే వారు. అయితే రామబ్రహ్మం మాత్రం చాలా ఓపిక తో తల్లిదండ్రులను ఒప్పించి అమ్మాయిల ను కూడా పక్కన ఉండే పట్టణం లో చేర్చి చదివించే వారు.
అలాగా రామాపురం అనే గ్రామం మొత్తం బాలికలను చదివించే గ్రామం గా పేరు గడించింది. మిగిలిన ఊళ్లలో రామాపురం కీర్తి ప్రతిష్ట లు
చర్చినీయాంశమయ్యాయి.
దీంతో రామబ్రహ్మం ను ఆ గ్రామానికి పెద్ద గా ఎన్నుకున్నారు. విద్యావంతులు ఉన్న రామాపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది.
ఆ గ్రామం లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. కేవలం ఒక ఉపాధ్యాయుడు మూలంగా ఆ గ్రామం దేశం లోనే ఒక ఉత్తమ గ్రామం అయింది.
ఈ గ్రామం లో మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి. బలులు, చేత బడులు ఉన్నాయని నమ్మి వేలాది రూపాయలు వెచ్చించి క్షుద్ర పూజలు చేయించే వారు. కాలక్రమంగా రామబ్రహ్మం గ్రామం లోని వారందరిని చైతన్య పరచి మాఢనమ్మకాల ఉభి నుంచి ఆ గ్రామం ను విముక్తి చేయించారు… దీంతో రామాపురం వాసులు సుఖమయ జీవనం గడిపే వారు.
ఉపాధ్యాయులు తలచుకుంటే నవసమాజం సమసమాజం ఏర్పాటు కావడం సులభం అనేది ఈ కథ లోని సారాంశం.
రామబ్రహ్మం లాంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సమాజానికే ఆదర్శం.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!