ఎంగిలాకులు

ఎంగిలాకులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వడలి లక్ష్మీనాథ్

గడియ, గంట విరామం లేక,
వారాంతపు సెలవు లేక,
భూసారంమంతా వెలికితీసి ,
గింజకు గింజచేర్చిన వైనం.
అన్నదాత అహర్నిశల కష్టం.
చెమట బిందువులు,
చేలో పంట కాగా,
గిట్టుబాటు రాక రైతుల దైన్యం.
చేతికొచ్చిన ధాన్యం
దళారీల కైవసం.
చేజిక్కించుకొన్న సరుకు
గిడ్డంగులలో నిక్షిప్తం.
ఆకలి మంటల కేకలు,
డొక్కల్లో చేరిన కాళ్ళు,
కంటి నీరు ఎండిపోగా,
మంచినీరు తీర్చె ఆకలిని.
ఆహారం లేక అలమటిస్తున్న
అర్భకుల బాధ.
అర్దం కాని, ఆడంబరపు పెళ్ళికి
అరవై రుచులు.
కుప్ప తొట్టికి చేరు
విందు వినోదాల వంట.
పండించిన రైతులకు పస్తులు,
ఆకలి గొన్న వాడికి,
ఎంగిలాకులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!