ఋణానుబంథేన

ఋణానుబంథేన
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్

మీ అమ్మ పోయిందని మామయ్య కూతురు గాయత్రి ఫోన్ లో చెప్పగానే వెంటనే లండన్ నుంచి ప్రకాశం ఇండియా వచ్చాడు. కార్యక్రమాలన్ని ఉన్నఊరు రాజమండ్రిలోనే గోదావరి తీరాన పుట్టి పెరిగిన దానవాయి పేటలో నాలుగిళ్ళ లోగిల్లో జరిపించారు అత్త మామయ్య. ప్రకాశం తండ్రి రాజమండ్రి లో పేరు మోసిన వేదపండితులు ప్రభాకర శాస్త్రి తల్లి లలితమ్మ. వారిది శుద్ధ స్తోత్రియ ఉన్నత కుటుంబం, రాజమండ్రికి కంచి పరమాచర్య వచ్చినప్పుడు ప్రభాకర శాస్త్రి గారు నిర్వహించిన సేవ చూసి తప్పక పుత్రుడు కలుగుతాడు. అన్నదానికి నిదర్శనం శాస్త్రి గారికి ఏభైవ ఏట జన్మించిన ప్రకాశం. లేక లేక పుట్టిన సంతానం ఆయిన ప్రకాశం. లలితమ్మ పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగాడు. భర్త వద్దన్నా పెద్ద చదువులు ఉంటే పిల్లల భవిష్యత్ బాగుంటుంది. అని పోరాడి మరీ లండన్ పంపించారు లలితమ్మ. ప్రకాశం వెళ్ళిన ఆరు నెలలకి శాస్త్రి గారు హఠాత్తుగా గుండెపోటుతో డెబ్భై మూడో ఏట శ్రీరామచంద్రుని దరిచేరారు. ప్రకాశం ఇండియా రాగానే భాధ పడుతుంటే లలితమ్మ గారు ఊరుకోరా మీ నాన్నగారికి మనతో ఋణం తీరిపోయింది వారు వెళ్ళి పోయారు మహానుభావులు. నేను మా తమ్ముడు అదేరా మీ మేనమామ కామేశం వాడి కూతురు గాయత్రి లేమా! భాధ పడకు రెండేళ్ళు పూర్తి చేస్తే గాయత్రి డిగ్రీ అయిపోతుంది. అక్కడ నీ చదువు పూర్తవుతుంది. పెళ్ళి చేసి, నేను మీ నాన్న గారి దగ్గరకు చేరుకుంటాను అన్నది. అలాగే అని లండన్ వచ్చి చదువు పూర్తి చేసి ఉద్యోగం రావడంతో తనతో పనిచేస్తున్న మేరీని అమ్మ వద్దన్నా వినకుండా, గాయత్రి కి నచ్చ చెప్పి పెళ్ళి చేసుకున్న వివాహబంధం పదేళ్ళక్రిందట
విడిపోయినప్పటికీ అమ్మకి చెప్పలేదు. అమ్మ క్రితంసారి ఇండియా వచ్చినప్పుడు అన్నది ఒరే నీతో బాటు పెళ్లైన గాయత్రి కి ఇద్దరు కొడుకులు. బడికి వెళుతున్నారు. పిల్లల గురించి జాగ్రత్త పడుతున్నారా. వయస్సులో ఉన్నప్పుడే పిల్లలు పుట్టాలి అంది అమాయకపు అమ్మ. దానికేం తెలుసు మేమిద్దరం విడిపోయామని, గాయత్రిని చేసుకుంటే బాగుండేది. చే జారిపోయిన బంధం. పుట్టినప్పుడే దేముడు వ్రాసిన రాతను తప్పించలేము కదా అని ఆలోచిస్తున్న నాగదిలోకి ఇద్దరు పిల్లలని గాయత్రి తీసుకొచ్చి పెదనాన్న ప్రకాశం అని చెప్పగానే లవకుశుల్లా ఉన్న ఇద్దరు పాదాభివందనం చేయడం చూసి ఆప్యాయతతో దగ్గర గా ” ఋణాను బంథేన పశు పత్నీ సుతాలయ” అన్నది నిజమే అని మనస్సులో అనుకున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!