నవయుగ వైతాళికుడు

నవయుగ వైతాళికుడు (ప్రక్రియ:పంచపదులు)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పాండురంగ విఠల్

ఆంధ్రలో బ్రహ్మ సమాజం స్థాపించాడు
యువజన సంఘాలను మొదలెట్టాడు
హితకారిణి ధార్మికసంస్థ నెలకొల్పాడు
సంస్థకు తన యావదాస్తిని ఇచ్చేశాడు
వీరేశలింగం పంతులు సంస్కర్త విఠల!
స్త్రీ విద్య-వికాసానికై ఉద్యమించాడు
బాలికా విద్యాలయాలు స్థాపించాడు
సహవిద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాడు
అంటరాని వారికి ప్రవేశం కల్పించాడు
ఉచితంగా విద్య-పుస్తకాలిచ్చె విఠల!
వితంతువుల వివాహం జరిపించాడు
అసత్యము అవినీతి వ్యతిరేకించాడు
అందుకే న్యాయవాద వృత్తి వదిలేశాడు
ప్రభుత్వ ఉద్యోగ యత్నం మానివేశాడు
దురాచారాలపై ధ్వజమెత్తాడు విఠల!
యుగకర్త-గద్యతిక్కన బిరుదులు పొందాడు
రాజశేఖర చరిత్ర నవలతో ప్రసిద్ధి గాంచాడు
వివేకావర్ధని పత్రిక పెట్టి రచనలు చేశాడు
హాస్య సంజీవనిలో వ్యంగ రచనలు వేశాడు
నవయుగ వైతాళికుడు కందుకూరి విఠల!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!