అందమైన అబద్ధం

 అందమైన అబద్ధం (నానీలు)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నాగ రమేష్ మట్టపర్తి

ఓట్లకోసం
రాజకీయ నాయకుల
ప్రతీ వాగ్దానం
ఓ అందమైన అబద్ధం

గోరు ముద్దలెడుతూ
అమ్మ పాడే
చందమామ పాట
ఓ అందమైన అబద్ధం

 అందమైనది అబద్ధం
అందుకేనేమో
అందరినీ
ఇట్టే ఆకర్షిస్తుంది

పోయిన వారు
తిరిగొస్తారని
భ్రమలో బ్రతకడం
అందమైన అబద్ధం

 ఓ అందమైన అబద్ధం
కొన్నిసార్లు
నిలబెడుతుంది
ఆత్మీయ బంధం

You May Also Like

One thought on “ అందమైన అబద్ధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!