అంశం: హాస్యం
ఆన్లైన్ పెళ్లిచూపులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చంద్రకళ. దీకొండ
“ఫలహారాలేవీ చేసినట్టు లేరు…?”
“చేసినా మీరు తినలేరు కదాని”…
“చూసైనా తృప్తి పడదామని…ప్చ్… అదో తుత్తి” ఏ. వి.ఎస్…లా అబ్బాయి తండ్రి!
“ఇదిగో…చూసారా మా అమ్మాయిని…అన్నీ ఒరిజినల్ గోల్డ్ జ్యువలరీ…వన్ గ్రామ్ కాదు”…అమ్మాయితల్లి!
“ఆ…ఆన్లైన్లో ఎలాగూ పట్టుకొని చూడలేముగా…”
తల పట్టుకుంటూ అబ్బాయి తల్లి!
“అమ్మాయి… నీ పేరేమిటన్నావ్?”…
అడిగాడు అబ్బాయి తండ్రి.
“అన్నీ బయోడాటాలో చూసుకొన్నారుగా”…
అంది అమ్మాయి!
“పాటలేవైనా వచ్చునా…?”
అన్నాడు అబ్బాయి.
“యు ట్యూబ్,గూగుల్ ఉన్నాయిగా”
అన్నది అమ్మాయి.
“వంట వచ్చునా…?”
అబ్బాయి తల్లి.
“స్విగ్గి, జోమాటో ఉన్నదెందుకో…”
ఫటాఫట్ గా అమ్మాయి!
“అమ్మాయి కాస్త నలుపనుకుంటా…”
అబ్బాయి తల్లి.
“లైటింగ్ సరిగా లేదు ఇక్కడ” అమ్మాయి తల్లి…!
“మా అబ్బాయికి కట్నకానుకలు…వగైరా”
అబ్బాయి తండ్రి
“ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లెమ్…వినిపించలా…”
అమ్మాయి తండ్రి!
“ఈ ప్రోగ్రాం అంతా సేవ్ అవుతోంది…ఆలోచించుకొని అడగండి”బెదిరిస్తూ అమ్మాయి!
“అమ్మాయి నచ్చినట్టేనా”అమ్మాయి తల్లిదండ్రులు
“వాట్సాప్ లో ఏ సంగతీ తెలియజేస్తాం”
అబ్బాయి తల్లిదండ్రులు!!!!!
చాల బాగుంది