స్పూర్తి ప్రదాతలు

స్పూర్తి ప్రదాతలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వరలక్ష్మి యనమండ్ర

ఉదయం లేచినప్పటి నుండి మరల నిద్ర పోయే వరకు ఎన్నో దృశ్యాలను చూసి, ఎందరో వ్యక్తులు వలన, ప్రకృతి వలన స్పూర్తి పొందుతాము. కొంత సహజంగానే కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. చిన్నతనం నుండి నాయనమ్మ, తాతయ్య , బాబాయిలు, అత్తయ్యలు, ఇలా అందరు కలసి ఒకే చోట ఉండడం వలన అందరితో కలిసిమెలిసి ఉండడం అలవాటైంది. కాబట్టి నా మొదటి స్పూర్తి ప్రదాతలు నా కుటుంబం సభ్యులుగా చెప్పాలి. నాన్నగారు ఉద్యోగంరీత్యా కొన్ని ఊర్లు తిరగవలసి వచ్చింది. మా ఇంటికి నాన్నగారి స్నేహితులు, పెద్దలు వచ్చేవారు. వాళ్ళతో స్వేచ్ఛగా మాట్లాడడం అలవాటైంది. ఎవరైనా పేదవాళ్ళు తటస్థ పడినా అమ్మ, నాన్నగారు ఉన్నంతలో వారికి సహాయం చేసేవారు. అలా నాక్కూడా సహాయగుణం అలవాటు అంది. అమ్మ, నాన్న నాకు ఈ విషయంగా స్పూర్తి ప్రదాతలు. పాఠశాలలో చదివుకునేటప్పుడు మా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు చెప్పిన ఎన్నో విషయాలు, వారి ప్రవర్తన వలన సమాజము, ప్రజల, దేశం, తోటివారి  పట్ల ఎలా మెలగాలో సంపూర్ణంగా తెలుసుకోగలిగాను. నా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నాకు ఆవిధంగా స్పూర్తి ప్రదాతలు. పెరిగే కొద్దీ డాక్టర్లను, డ్రైవర్లను, నటులను చూసి వారు నిరంతరము, ఏ సమయంలోనైనా సేవ చేయడం చూసి, పని పట్ల నిబద్ధత కావాలని తెలుసుకున్నాను. ఆ విధంగా నాకు వారు కూడా స్పూర్తి ప్రదాతలు. నా భర్త చాలా నిబద్ధతతో పని చేస్తారు. చాలా ఖచ్చితమైన వ్యక్తి. తను కూడా నాకు ఎన్నో అంశాల్లో స్పూర్తినిచ్చారు.
ప్రకృతిలో చాలా అంశాలను చూసి చాలా విషయాలను నేర్చుకున్నాను. భూమి వలన ఓర్పు, చీమ వలన పనితనం, సాలీడు వలన పనితనం, ఇలా ఎన్నెన్నో నేర్చుకున్నాను. ప్రకృతి కూడా నాకు స్పూర్తి నిచచింది. అందుకే నేనొక ఉపాధ్యాయురాలను కావాలనుకున్నాను. అయ్యాను కూడా. నేనేవైతే నేర్చుకున్నానో నా విద్యార్ధులకు తెలియజేస్తూ వారికి నేను ఆదర్శంగా ఉండాలన్న కొరికి తీరిందని.. నా విద్యార్ధులను, వారు చేసే పనులను చూసి, వారు చెప్పే మాటలు వలన తెలుసుకుని చాలా సంతోషిస్తున్నాను.
ఇలా చొరవగా మీముందు ఉండగలిగానంటే పైవారందరూ నాకు స్పూర్తి అని స్పష్టంగా తెలుస్తుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!