బస్సు ప్రయాణం

అంశం:సస్పెన్స్/హారర్

బస్సు ప్రయాణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కాటేగారు పాండురంగ విఠల్

రవి రోజులాగే ఆఫీసుకు వెళ్ళడానికి బస్సు స్టాపుకు చేరుకున్నాడు. ఒక్క నిమిషంలో నలభై ఆరు గురు కళ్ళముందు మెదిలారు. ఆ టైముకు ఉదయమే పేపర్లో చదివిన వార్తలను, అప్పటికే పది మందికి చెప్పి,మెల్లగా వచ్చారు శాస్త్రి గారు. ఏంటండీ!ఈ ముఖ్య మంత్రికి బుద్ధి వుందా!అధికారం నిలబెట్టుకోవడానికి అప్పులు చేసి అడిగిన వారికి, అడగని వారికి వరాల జల్లులు కురిపిస్తున్నాడు. ఇంకా చెబుతుంటే సరళ వచ్చింది. వాళ్ళ గ్రూపు కలుసుకొని, సీరియళ్లు యమా సీరియస్గా చర్చించుకొని, పెళ్ళాన్ని ఎడిపించే హీరోని, అడబిడ్డను కాల్చుకుతినే కోడలిని, అత్తను-మొగుణ్ణి సవాలుచేసే కోడలిని. ఒకటేమిటి ముప్పై ఆరు సీరియళ్లను మూడు నిమిషాలు చీల్చి, విమర్శించి, వినోదం పంచుతుంటే బస్సు వచ్చింది. పుట్టలో దాక్కున్న చీమల్లా బరబరా, జరాజరా పాక్కుంటు వచ్చి,కిటికీల నుంచి బ్యాగులు, కర్చీపులు వేసి, రెండు ఎంట్రెన్సుల్లో నుండి తోసుకుంటూ, దొబ్బుకుంటు ఎక్కుతున్నారు. రాజు ఎక్కి సీటుపై వేసిన దస్తీ తీసి కూర్చుని ఫోన్ కోసం చూస్తే,జేబు ఖాళీ! లబో దిబోమంటూ వేరే వారితో ఫోన్ చేయిస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. రవి నిదానంగా వచ్చి ఎక్కి, సీటు లేనందునా ఒక్కొక్కరిని జరుగు జరుగు అని బతిమలాడినా ఒక్కరంటే ఒక్కరు సీటు షేర్ చేసుకోలేదు. మనుషుల్లో మానవత్వం లేదు, దయ, జాలి, కరుణ అస్సలు లేదని బస్సు మూడు స్టెప్పులు దాటే వరకు దండకం చదివాడు. అక్కడ తను నిలబడిన పక్క సీటు ఖాళీ కాగానే, ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంతో కూర్చున్నాడు. ఆ స్టేజీలో ఒక డెబ్భై ఏళ్ల వృద్ధుడు వచ్చి రవికి సీటు అడిగితే ఛా ఛా పక్కనోడి బాధ అర్థం చేసుకోరు !ఎక్కీ ఎక్కగానే సీటు కావాలంటారు అని ముసయాలయన పట్ల ఛీత్కారం ప్రదర్శించి వెకిలిగా నవ్వుతున్నాడు. మరో రెండు స్టాపుల తరువాత సరిత కండక్టరుకు చిల్లర ఇవ్వమని అడిగితే, ఐదు రూపాయలు ఇవ్వండి మేడం ఎనభై రూపాలలిస్తానంటే, బ్యాగు జిప్ తీసి చూస్తే పర్సు మాయం. అటు ఇటు వెతుకుతుంటే, దిగండమ్మా!ఇప్పటికే అలస్యమయ్యిందని, జనం ఒక్కొక్కరు ఒక్కోలా ఏకసెక్కములాడుతుంటే, ఏడుస్తూ దిగుతుంటే, అందరూ విరగబడి నవ్వుతున్నారు.
మరో నాలుగు స్టాపుల్లో చివరి మజిలీ చేరుతుందనగా, బస్సులో సగం సీట్లు ఖాళీ అయ్యాయి. తరువాత ఉన్న సీట్లో ఓ నడి వయస్కుడు మూసిన కళ్ళు తెరచి, ఇది ఏ స్టేజీ అని పక్కవాన్ని అడిగాడు. అతడు చెప్పింది విని, బ్యాగు సర్దుకొని ధన్ ధనా ధన్ ధన్ కొట్టి ఆపండి ఆపండి ఆపండి అంటూ పిడుగులు పడేలా అరుస్తున్నాడు. కాండక్టర్ను పొడిచేలా చూస్తూ, స్టేజీ వస్తే చెప్పామన్నాగా, మూడు స్టేజీలు దాటి పోయాయి అంటూ తిడుతూ, అరుస్తూ బస్సును బాదుతున్నాడు. ఇవేమీ పట్టించుకోక డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు. ఎందయ్యా!చెవుడా!అని అరుస్తున్నాడు ఆ మధ్యవసు పరంధామయ్య. మధ్యన ఆపమండి. ట్రాఫిక్ జామ్ అయితదని, గేర్లు ఇంకా పెంచుతూ నడుపుతున్నాడు డ్రైవర్. తరువాత స్టేజ్ రాగానే కండక్టర్, డ్రైవర్లను మింగేసేలా చూస్తూ దిగి పోయాడా వ్యక్తి. ఇరవై నిమిషాల తరువాత చివరి స్టాపు రాగా, కాంట్రక్టరు, డ్రైవరు అరుస్తున్నా, అత్తారింటికి పోయె కోడళ్లవలే బాధతో, రొప్పుతూ మెల్లగా దిగుతున్నారు ఒక్కొక్కరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!