కన్య వయస్సు

కన్య వయస్సు

రచన: యాంబాకం

     ఒక చక్కటి కుటుంబం ఏంతో పెద్దది అందులో అవ్వ తాత, అమ్మ నాన్న, పిన్ని బాబాయ్, అత్త మామ, ఎదురింటి వారు,పక్కింటి వారు,చుట్టూవారు, చుట్టాలు ఇంకా ఇలా ఎన్నో ఎన్నెన్నో కలపూసిన బంధాలు అనుబంధాలు అలకలు పలకలు పండుగలు పేరంటాళ్ళు పెళ్ళెల్లు వీడుకోళ్ళు ఇలా అన్ని కలిసి మెలిసే ఉండేదే చక్కటి కుటుంబం.ఎక్కవ ఇలాంటి కుటుంబాలుపల్లెల్లో ఉంటాయి. అలాంటి పల్లెల్లో పుట్టినదే మహేశ్వరి అందానికి అందం మహేశ్వరి.

     మహేశ్వరి పల్లెటూరు అమ్మాయి పల్లె లోనే పుట్టి అక్కడే పెరగడం వలన ఆపల్లె అమాయకత్వం,వచ్చినట్లు ఉంది  అది పోలేదు.మహేశ్వరి ఇప్పుడు  “కన్యవయస్సు” మనసులో ఎన్నో “ఆశలసౌధాలు” మహేశ్వరి అమ్మ  మహేశ్వరిని ఆఊరిలోనే చదివిస్తుంది. అప్పటి లో ఆడపిల్ల ని చదివించటం చాలాగొప్ప కానీ మహేశ్వరి బామ్మ ప్రోత్సాహం తో మహేశ్వరి పదిపాస్ అయింది. ఇంక ఆ ఊరిలోని వారంత మహేశ్వరి కి నీరాజనం పట్టారంటే నమ్ము అసలే అమాయకురాలు మహేశ్వరి ని అందరూ పోగడగా తను ఎదో సాధించినంతగా భ్రమపడ సాగింది.

    మహేశ్వరి తోటి విద్యార్థులు అయితే నీకేమి పది పాస్ అయిపోయావు ఇక గొప్ప గొప్ప సంబంధాలు వస్తాయి అని మహేశ్వరి కి ఆశలు పుట్టించారు.  ఇక మహేశ్వరి ఒకటే అలోచన గాలి ఆశల సౌధం మొదలైంది. పెళ్ళి గురించి తనకు రాబోయే భర్త గురించి భర్త తో కాపురం గురించి.మహేశ్వరి అమ్మ తన తమ్ముడు కి ఇచ్చి పెళ్లి చేయాలనితన ఆశ, మహేశ్వరి నాన చేల్లెలకి తన కొడుకు కి ఇచ్చి చేసుకోవాలని, మహేశ్వరి వాళ్ళు అమ్మమ్మ తాతయ్య పది వరకు చదువుకున్న అమ్మాయి గౌవర్నమెంటు ఉద్యోగి కి ఇచ్చి చేయాలని వారి ఆశ,,నానమ్మ తాతయ్య వాళ్ళు కూతురు బిడ్డకు ఇచ్చి చేయాలని వారి ఆశ, ఇలా ప్రతి బంధం ఆశలు సౌధం గా ఆలోచిస్తూన్నారు.

       మహేశ్వరి స్కూల్ మాస్టర్ సలహా మీద మహేశ్వరి అమ్మ  మహేశ్వరిని కాలేజీ లో చేరిపించాలని నిర్ణయించు కొని,పక్కన టవున్ లో ఒక కాలేజి లో చూసి మాస్టర్ సహయం తో కాలేజిలో చేర్పించింది. కాని “కొంత మంది దగ్గర చుట్టాలు ఆడపిల్లలు ఎంత చదివినా బయట కు పోవాలసిన వారె!పెద్ద పెద్ద చదువులు ఎందుకు పెళ్లి చేసిపంపక తప్పదు. అని ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు.

     మహేశ్వరి అమ్మ కూడా బంధువుల సలహాలకు “కొంచెం తటపాయించినా తరువాత ఆలోచించి, మహేశ్వరిని పలిచి మహేశ్వరితో ఇలా”! అంది.చదువుకోంటావా లేక పెళ్లి చేసుకొంటావా నీ ఆశలు ఆశయాలు ఏమిటో ఇప్పుడే నిర్ణయించుకో అని మహేశ్వరి అమ్మ చెప్పగా,మహేశ్వరి అలోచన లో పడింది  అమ్మ ఒంటరిగా కష్టపడి నన్ను పెంచుతుంది  నేను పెళ్లి చేసుకుని అత్తవారింటి కి వెళ్ళిపోతే ఇక అమ్మ ఒక్కటే కానీ ఏ రోజుకైన అమ్మ ని ఒంటరిగా వదలాలి అమ్మ ని నాతోనే రమ్మంటే అమ్మ ఆత్మాభిమానం తో రాకపొవచ్చు నేను పెళ్లి చేసుకొంటే నా కాపురం,నాభర్త, నాపిల్లలు,నా అనే భావంతో అమ్మ కు దూరం అయిపోతాను ఇప్పుడు ఎమి చేయాలి అమ్మ కు దూరంగానా అత్తవారింటికి పరిమితమా ఏది? నా “ఆశలసౌధం”అని తపన పడసాగింది.

ఇంతలో మాస్టర్ మహేశ్వరి ఇంటికి వచ్చాడు.” మహేశ్వరి అమ్మ మాస్టర్ తో ఇలా చెప్పింది. ఇరుగు పొరుగు వారు చదువు ఎందుకు పెళ్లి చేయక, అదే కరెక్ట్ అని అంటన్నారు మాస్టర్” అని అన్నది. అప్పుడు చూడమ్మ! నిర్ణయించుకొనే వయసులో మహేశ్వరి లేదు మంచైన చడైన నీవే నిర్ణయించు కోవాలి, నీవు ఇచ్చే మార్గంలో లోనే పిల్లలు వాళ్ళ “ఆశలసౌధం” నెరవేర్చు కొంటారు.అసలు పెద్దలు పిల్లలను బాధ్యత గా ఆశలు కు అనుగుణంగా పెంచాలి అప్పుడే వారికి ఉన్నత స్థాయికి ఎదుగ గలరు. ఇప్పుడు పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం అక్కడే ఆగిపోతుంది.కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిడబల గలగాలి అప్పుడే వారు దేశానికి వంశానికి పేరు తెస్తారు.అని మాస్టర్ చెప్పి వెళ్లిపోయాడు.

         ఇంతలో మహేశ్వరి ఇంటికి చుట్టాలు రాగ ఇల్లులంతా బిజీగా మారిపోయింది. చుట్టాలు మహేశ్వరి అమ్మ మధ్య చాల వాదనలు, సలహాలు, సూచనలు జరగ గా మహేశ్వరికి వాళ్ళు అమ్మమ్మ తాతయ్య అనుకొన్న ప్రకారం గౌర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయి తో పెళ్ళి జరిపిచారు. ఇద్దరు ఆడపిల్లలు వారు కూడ పదోక్లాసు లోకి వచ్చారు.కానీ మహేశ్వరి భర్త గౌవర్నమెంటు ఉద్యోగి వచ్చే జీతం జానెడు ఖర్చులు మూరడు చాల ఇబ్బంది గా ఉంది పెద్దలకు మందులు పిల్లలకు ఫీజు లు ఇంటి ఖర్చులు ఇప్పుడు ఇదే ఆలోచన మహేశ్వరికి అప్పుడు నేను చదుకొని నేను ఉద్యోగం చెసిఉంటే నా కాపురం ఇంత కష్టపడ వలసన అవసరం ఉండేది కాదు.
అందుకే నేను “ఈరోజు నుండి నా “ఆశలసౌధం” నా పిల్లలకు ఇలాంటి పరిస్థితులు రాకుండా వారిని పెద్ధ పెద్ద చదువులు నేర్పించి వారి కాళ్ళమీద వాళ్ళునిలబడేటట్లు చేయడమే” అని గట్టిగా నిరయించుకోని భర్త కష్టాలకు తాను తోడైయింది. చిన్న చిన్న పనులు నేర్చుకొంది టైలరింగ్, చెసి నెల నెల కొంత సంపాదించడం వేసవి లో  వడియాలు పెట్టి షాపులకు ఇవ్వడం ఇలా  తను భర్త సంపాదనకు వేడి నీళ్ళు కు చన్నీళ్ళు లా తోడై ఇద్దరి కూతుళ్లు ను ఒకరిని ఇంజనీరింగ్, మరోకరిని డాక్టరు చదివించింది. అలాగే వారు మంచి ఉద్యోగం లో చేరగా వారికి ఘనంగా వివాహం జరిపించింది.భర్త,అమ్మ,కూతుళ్లు తో అందరితో మహేశ్వరి సంతోషంగా ఉండసాగింది. మహేశ్వరి “ఆశలసౌధం” నిలబడింది.

        ఒక్క మహేశ్వరే కాదు ప్రతి యువతి యువకులు ఆశయంతో ఎదగాలి కేవలం భర్త సంపాదనతో,తల్లిదండ్రుల, ఆస్థుల పై  లేకపోతే కానుకలపై ఆదారపడ కుండా “ఆశలసౌధం” పై ఎదగాలి అప్పుడే జీవితం మూడు కష్టాలు ఆరు సుఖాలుగా ఉంటుందని మహేశ్వరి నిరూపించింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!