తను- మను

తను- మను

రచన: జయ

కలవో నిజమో మాయో తెలియక సతమతమౌతున్నా మనస్సుకు ఎన్ని ఆశలు జీవితాన్ని ప్రేమ మాయం గా మలుచుకోవాలెనే ఆరాటం పోరాటం గా మారి గజనిమహ్మద్ దండ యాత్రలు చేస్తుంది. ప్రేమ తోనే అన్ని సాధ్యం అనే సత్యాన్ని నమ్ముతూ.

చిన్నతనం నుంచి సంగీతం అంటే ప్రాణం పెట్టె ఓ కోయిల ను నేను. కానీ ఆ కోయిలకు పంజరం తప్ప వేరే లోకం తెలియదు. ఆశలు మాత్రం కోటలు దాటి ఎన్నో వసంతాలు చూసేయాలి నింగిలో తార లా మెరిసిపోవాల్ని చిరు కోరిక.

అనుకోకుండా ఆ కోయిలకు వేరే పంజరంలో ని గోరింకతో జత చేయాలని నిశ్చయించుకొన్నారు అని తెలుసుకొని.
పంజరాన్ని వదిలి ఎగిరిపోవాలని నిర్ణయం తీసుకొని. మంచి తరుణం కోసం చూసి పంజరం నుంచి తప్పించుకున్న కోయిలల హాయిగా వచ్చేసింది కానీ. బయట అంతా కొత్త పైగా ఎటు చూసినా మృగా రాజులు కోలాహలం . బెదురు బెదురు గా ఉన్న ఆమె కి నేను ఉన్న అంటూ చెయ్యి అందించాడు మను. అప్పుడు ఆమె కి తెలియదు తన ఆశల సౌధానికి యువరాజు మను అవుతాడు అని.

మను కూడా స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తి ఆమె కథ విని తన కలలు నెరవేర్చుకోడానికి తను సహాయం చేస్తా అని మాట ఇచ్చి తనకి తోడుగా నిలిచాడు.

ఆమె ని సంగీతం క్లాస్ లో చేర్పించి ఆమెకి తను ఉన్నా అని ధైర్యాన్ని ఇచ్చి అడుగడుగున తోడై నిలిచి. తన ప్రేమను, స్నేహాన్ని ఆమె కి అందిస్తూ చివరికి ఆమె ను ఓ సంగీతదర్శకుడు దగ్గర చేర్పించి. ఆమె మంచి గాయనిగా పేరు తెచ్చుకుంది.

ఒక రోజు మనో ఆమె దగ్గరికి వచ్చి ఇక నా అవసరం నీకు ఉండకపోవచ్చు ఇలానే మంచి గాయనిగా పేరు తెచ్చుకో అని ఆమెని కౌగిలించుకొని నుదుటిపై ఒక ముద్దు ఇచ్చి వెళ్ళిపోతాడు.

అప్పటి వరకు ఆమెకె తెలియని కొత్త అనుభూతి మనో స్పర్శ తో ఆమె కి తెలిసింది.మనో వెళ్లిన దగ్గర నుండి తన కోసమే ఆలోచిస్తు. మనోతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకొని తను కూడా మను ని ప్రేమిస్తున్న అని తెలుసుకొని.
అన్ని రోజులు తన పక్కనే ఉన్న లేని అనుభూతి. తను విడిచి వెళ్ళాక ఆమె కి తెలుస్తుంది. క్షణం ఒక యుగమై గడిచి న కాలాన్ని మను లేకుండా తను లేను అని అర్ధం అయ్యింది ఆమె కు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మను కి కాల్ చేసి. మనుని చేరి. మను ని చూసిన క్షణం తన కళ్ళలో నుంచి జారిన ఓ భాష్ప బిందువు తెలిపింది మనో కి ఆమె హృదయంలో తన స్థానం ఏమిటో. మనో కి కూడా అదే అనుభూతి ఇద్దరు ఒక క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు ఇద్దరు హృదయాలు, తనువులు కౌగిలిలో కరిగిపోడానికి.

“”కుదురేమరచిన నా హృదయం
నన్నే ప్రశ్నిస్తూ ఉందే
నా కంటూ ఉందా క్షణకాలమైన అని
నా మౌనానికే జతకలిసి నడిచి
కొత్త కొత్త భావాల పదనిసలు నేర్పిన
నీ తీయనైన పలుకే..వేధిస్తూ ఉందే
ఇప్పుడు ఒంటరినే.. చేసి.
నే నవ్వుతుంటే మురిసిపోయే
ఓ స్నేహం ఆ నవ్వునే మరచి
సాగిస్తుందా పయనం..””
అని ఆమె మనో ను అడిగిన ప్రశ్నకు మనో సమాధానం ఆమె నుదిటిపై తన ముద్దు.

ఆమె కి అర్ధం అయ్యింది నా ఆశాలసౌధానికి ఒక అర్ధం స్థిరనివాసం కలిపించిన మనో నే తన జీవితానికి ప్రేమ ను అద్దిన కలల రాకుమారుడు అని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!