స్ఫూర్తి ప్రదాత!

స్ఫూర్తి ప్రదాత!

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

“లేచింది నిద్ర లేచింది, మహిళా లోకం,
దద్దరిల్లింది పురుష ప్రపంచం ,”
మహిళల స్వాభిమానం ఆకాశమంత పెరిగింది,
అన్ని రంగాలలోనూ, అలవోకగా దూసుకుపోయే
స్త్రీ లోకం!
వేల కిలోమీటర్లు 20 టన్నుల భారీలారీలను
సైతం గమ్యానికి, ఒంటరిగా తోడుకు పోయేది ఆనాడు పురుషులైతే,
ఈనాడు ఎంతో క్రమశిక్షణతో ‘స్త్రీ కూడా భారీ వాహనాలను సైతం,
చక్రం తిప్పగల నైపుణ్యం, ఈనాటి మహిళలదే!
“గగనతలంలో విమానానికి ,’పైలెట్ లా’
గంటల వ్యవధిలో, స్త్రీలు కూడా ఎంతో చాకచక్యంగా,
‘ఆకాశమార్గాన కూడా గౌరవం పొందారు, పురుషులతో సమానంగా!!
‘అత్యంత వేగవంతమైన రైలు మార్గంలో, ‘లోకో డ్రైవర్ గా ‘శిక్షణ పొంది, అత్యంత నైపుణ్యం తో
గమ్యానికి చేర్చగల సమర్థులు, స్త్రీలు కూడా,!
“దేశ రక్షణకు సైనికురాలిగా,
‘పట్టణ వ్యవస్థకు పోలీసుగా,
క్లిష్టమైన ఆస్పత్రి వ్యవస్థలో కీలకమైన నర్సుగా,
‘కుటుంబ వ్యవస్థకు ఆది దేవతలా!! ఈనాటి స్త్రీ, అధునాతన పోకడలతో,
కంప్యూటర్ రంగంలో అగ్రశ్రేణి పదవులు పొందుతూ పురుషుల ను
మించిపోయే, సకలగుణ సంపన్నురాలు
ఈనాటి మహిళలు మీకు జోహార్లు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!