పిల్లల మంచి మనసు

పిల్లల మంచి మనసు

రచయిత:శివ

నా పేరు శివ, మా ఊరు మిట్టకందాల….మా ఊరు లో ఎన్నో అంగడ్లు (కొట్టు) ఉన్నాయి ….అందులో ను మా విధి చివరన ఒక్క చిన్న అంగడి ఉంది , అది ఎలా ఉన్నది అంటే గాలి వచ్చిన , వర్షం పడిన సబ్బు బిళ్ళ జరిపడున్నటు ఆ అంగడి అలా ఉంది అన్నమాట…
ఇంకా ఆ అంగడిలో ఒక్క ముసలి తాత .
అతని తో పట్టు నాలుగు పండ్ల (దంతాలు)ముసలి అవ్వ, వాళ్ళకి ఒక్క కొడుకు

ఇంకా కథలో కి వెళ్లతే….

ఆ అంగడి దగ్గరలో …ఒక్క చిన్న స్కూల్ ఉండింది
స్కూల్ ఇంటర్వెల్ కొట్టినప్పుడు పిల్లలు వచ్చి వాళ్లకు కావాల్సింది కొన్నుకోని.. వాళ్లతో ప్రేమ గా పలకరించే వారు …నేను ఆ అంగడి కి వెళ్లి కాస్త వాళ్ళతో కాల యపన చేసేవాడిని …
నాకు వాళ్ళ చెంత కూర్చునంత సేపు నా బాధ అంత …ఒక చిన్ని చిరునవ్వుతో పరి పొయ్యేది
ఎందుకంటే అవ్వ ఓయ్ నినే అంటే తాత చెప్పు పిల్ల అంటూ చాలా ప్రేమ గా మాటాడుకొనేవాళ్ళు
అంత సంతోషం గా ముందుకు పొయ్యి రోజులు
కానీ అప్పుడప్పుడు మనం నవ్వుతూ ఉంటే చుట్టూ వున్న వాళ్లకే కాదు అందరితో కలసి పోయే కాలం కూడా ఏడిపిస్తుంది అది నాకు ఎప్పుడు తెలిసిందంటే

ఓ నాడు…రాత్రి ఒక్క ఇంటిలో నుండి ఏడుపులు.. కేక్కలు విన్నబడుతున్నాయి అరే ఏమి అయ్యింది అని వెళ్లి చూస్తే …అది ముసలి అవ్వ,తాత
ఎందుకని పక్కనోన్లను అడిగితే వాళ్ళ అబ్బాయి తాగి వచ్చి కొట్టాడు అని చెప్పారు …నేను వెళ్లి వాళ్ళ ను ఓదారిచి ఇంటిలోకి వెళ్ళమని చెప్పాను

అంతే మరునాడు ఉదయం వాళ్ళ అబ్బాయి చావు బ్రతుకులో వున్నాడు అని తెలిసి బోరున ఏడ్చేశారు …వాళ్లకు తాగినా సాయం చేయమని అందరిని ప్రార్థించారు కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు …నేను ముందుకు నడిచి ఆ అవ్వని ఇలా అడిగాను మిమ్మల్ని రోజు తాగి కొటేవాడు కదా అతను ..అతని వల్లే కదా మీరు ఇప్పుడు కష్ట పడేవారు మరి అతని కోసం ఎందుకు ఇలా విలపిస్తున్నావు అన్నాను అప్పుడు అమ్మే ఎంతెంన వాడు నా కొడుకు కదా అయ్యా !!అని ఏడ్చేస్తుంది

నేను వెంటనే ఇంటికి వెళ్లి నాకు కాస్త డబ్బులు అవసరం ఉంది ఇవ్వమని అడిగితే ..మా వాళ్ళు
అరేయ్ మన ఇల్లు గడవడానికి డబ్బులు సరిపోవవు నేను ఎక్కడిని నుండి ఇవ్వాలి అని అన్నాడు …అప్పుడు నాన్న మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వు చాలు అన్నాను అప్పుడు మా నాన్న గారు 20000 రూపాయి లు ఇచ్చారు కానీ అది ఎందుకు సరిపోదు అని కనిపిచిన్న ప్రతి ఒక్కరినీ అడిగాను కానీ ఎవరూ ముందుకు రాలేదు …
కానీ అందరూ అంటారు కదా కష్టాల్లో ఉంటే దేవుడు తప్పక చూస్తాడు అని అది నాకు నా కళ్ళ ముందే జరిగింది …నేను చెప్పాను కదా ఆ అంగడికి దగ్గరి లో స్కూల్ ఉంది అని ఆ ఆ స్కూల్ ఉన్న ప్రతి పిల్లవాడు వచ్చి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు అది చూసి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చారు …
.
అప్పుడు అనిపించింది …పిల్లల్ని ఎందుకు దేవుడితో పొల్లుస్తారో అని

ఇంకా ఏముంది ఈ కథలో అతను బ్రతికి ముసలి జంటను క్షేమంగా చూసుకుంటూ…అందరితో ఆనందం గా వున్నాడు.

***

You May Also Like

6 thoughts on “పిల్లల మంచి మనసు

  1. Natural ga unna kuda , story ekkado vinnatu unna kuda
    Chadhuvu thunnapudu chala intrrsting ga undhi siva ,keep going all the best siva

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!