మా వీర్రాజు కొట్టు

మా వీర్రాజు కొట్టు

రచయిత:: శాంతి కృష్ణ

మాది ఒకప్పుడు అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలతో కలకళలాడేది. పిల్లల టైర్ల ఆటలు, ఆరిందల ముచ్చట్లు, నీళ్ళ పంపుల దగ్గర గొడవలు ఇలా ప్రతివీధి నిత్యకల్యాణం పచ్చతోరణం లా ఉండేది.
అన్నిటికంటే ముఖ్యమైనది మా వీధి చివర ఉన్న వీర్రాజు చిల్లరకొట్టు. అమ్మ పావలా ఇచ్చిన 20 పైసలు ఇచ్చిన పరుగున వెళ్లి పెప్పర్మింట్ కొనిక్కుని చప్పరిస్తూ ఆటలు ఆడుకునేవాళ్ళం.
అవటానికి చిల్లరకొట్టయినా అన్ని రకాల సరుకులు దొరికేవి. ఏదొక వంకన రోజుకోకసారైన వీర్రాజు చిల్లరకొట్టుకు వెళ్లకపోతే వెలితి గానే అనిపించేది.
కాలం గడిచేకొద్దీ, ఊరు, ఊరి తీరు అన్నీ మారాయి. కూలిపనులు మాని ఉద్యోగాల బాట పట్టారు జనాలు. నెల సరుకులకు చిల్లర కోట్లు, సరుకుల దుకాణాలు వదిలి; డి-మార్ట్ లు బిగ్ బజార్లు అంటూ కిక్కిరిసిన జనాలమధ్య కంగారు కంగారుగా బట్టలు కొనుక్కున్నట్టు సరుకులను ఆ కంపెనీ ఈ కంపెనీ అని ఎంచి ఎంచి కనుక్కోవడం మొదలుపెట్టారు.
ఊరిలో చిల్లరకోట్లు మెల్లగా మాయమవసాగాయి. కానీ మా వీర్రాజు చిల్లరకొట్టు మాత్రం తనకి మళ్ళీ పూర్వ వైభవం రాకపోతుందా అని అలా మెల్లగా నడుస్తూనే ఉంది.
కాలం కలిసొచ్చిందో, మనిషి విపరీత కృత్యాలకు లేక కాలం కాటేసిందో తెలియదుకాని, జనాలలోకి కరోనా వచ్చి పడింది. జనాల మధ్య తిరగడానికి భయపడాల్సొచ్చింది. పెద్ద పెద్ద మాల్స్ నుండి సరుకులు తెచ్చుకోవడానికి జనాలు భయపడటం మొదలు పెట్టారు. మళ్ళీ జనాలు ఎక్కువగా లేని చిన్న చిన్న దుకాణాలు, చిల్లర కోట్ల బాట పట్టారు.
అలా మళ్లీ మా వీధి చివర వీర్రాజు చిల్లరకొట్టు తిరిగి కలకళలాడటం మొదలు పెట్టింది. ప్రతి చిన్నదానికి టౌన్ కి పరిగెత్తే జనాలంతా మళ్లీ వీధిచివర చిల్లరకొట్టు ను ఆశ్రయించక తప్పలేదు. కరోనా పోయినా మా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో పెనవేసుకున్న ఆ చిల్లరకొట్టు మాత్రం కలకాలం కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

***

You May Also Like

One thought on “మా వీర్రాజు కొట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!