ఎదో అలా ఎక్కువగా

ఎదో అలా ఎక్కువగా

రచన: ఎన్.ధన లక్ష్మి

అభిమానం ఎక్కువే
ఆత్మీయత కూడా ఎక్కువే
ప్రేమ ఎక్కువే…
ద్వేషము కూడా ఎక్కువే …

కోపం ఎక్కువే
ఆవేశం కూడా ఎక్కువే…
బాధ ఎక్కువే..
ఆ బాధను భరించే
ఓపిక కూడా ఎక్కువే..

అల్లరి ఎక్కువే..
తింగరితనం కూడా ఎక్కువే..
వాగుడు ఎక్కువే…
నిశ్శబ్దం కూడా ఎక్కువే

సహనం ఎక్కువే
అసహనం కూడా ఎక్కువే
మమకారం ఎక్కువే ..
వెటకారం కూడా ఎక్కువే…

ఆశ ఎక్కువే…
అత్యాశ కూడా ఎక్కువే ..
గెలవడం ఎక్కువే
ఓటమి పలకరింపు కూడా ఎక్కువే ..

అన్ని ఎక్కువ అయి…
అందరిలో తక్కువే అయి…
ఒంటరి పక్షి లాగ మిగిలిన కూడా…
బాధ్యతను, పోరాటాన్ని వీడను…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!