ఆలోచనాయుధం

ఆలోచనాయుధం

రచన: రేపాక రఘునందన్

కొన్ని కొన్ని ఆలోచనలు
క్షణ భంగురాలే… ఐతేనేం
అక్షరాలను ఆయుధంగా మారుస్తాయి
భావాలను ప్రతిధ్వనింపజేయటంతో పాటు
తరాల రాతలు మార్చే విధాతలౌతాయి
కొన్నికొన్ని ఆలోచన్లు ఊహల్లో విహరించినా
గోడకున్న రంగులచిత్రంలా
దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి
అస్థిరులు శాసించినా, శపించినా
తుళ్ళి పడుతూ తొలకరి చిరునవ్వుతో సేదదీరతాయి…..
అనుమానాల్ని, అవమానాల్ని
త్యజించి పైరగాలి రెపరెపలకి
తలలూపే వరికంకుల్లా పరవశిస్తూనే ఉంటాయి
రావిచెట్టుకు కట్టిన అట్లతద్ది ఉయ్యాల్లోని పల్లెపడుచు పట్టు పరికిణీలా
కొత్త నీరు వచ్చే కాల్వలో వేసిన
పసుపు కుంకుమ పువ్వుల్లా
అప్పుడే ఆలోచన  హృదయాలను తాకుతుంది
రాతిమీది గీతలా  స్థిరమై నిలుస్తుంది
మనస్సుల్లోతుల్లో మమతల్ని
కొలిచే ప్రామాణికం అవుతుంది.

You May Also Like

2 thoughts on “ఆలోచనాయుధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!