నిరీక్షణ

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

నిరీక్షణ 

రచన: జె వి కుమార్ చేపూరి

ఊహలు గుస గుస లాడె
మనసు రెక్కలొచ్చి ఎగిరె
మది నీ చెంత వాల గోరె
కనులు నీకై ఎదురు చూసె

ప్రియ చెలి బిడి కౌగిలి జేర
తనువు తహ తహ లాడె
మది సఖి స్పర్శకై ఉవ్విళ్లూరే
క్షణాలు యుగములు ఆయె

ఊహల్లో మన ప్రణయం
కోరేను ఒకరికొకరి కుశలం
మన ఇద్దరి ప్రేమ పదిలం
సుఖమనిపించే ఈ విరహం

వీచే గాలి తెస్తుంది నీ సౌరభం
కదిలే మేఘం తెస్తుంది నీ సందేశం
ఆకులు మెల్లగ కదిలిన శబ్డం
నీరాకేమో అంటుంది నా హృదయం

నీవెక్కడ వున్నా కొరతా నీ క్షేమం
నీ రాకకై వేచి చూస్తా అనుక్షణం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!