ఊహాలోకం

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

ఊహాలోకం

రచన: M.సుశీల రమేష్

కలలో నీవే కనబడితే
మనసులో అలజడి మొదలై తే
కోరికలు అలలై ఉప్పొంగి
ఉరకలు వేస్తుంటే
తనువంతా నీ పలకరింపులు
పులకింతలై నన్ను తడుముతుంటే
ఆపలేని విరహాగ్ని తనువుల
దాహం పెంచుతుంటే
కాలానికి సంకెళ్లు వేసి
మన బాహువులకు చుట్టేసి
పొదరింటికి పద పద మంటూ
తొందర పెడుతుంటే
గాలి చొరబడని ఆలింగనంలో
పెదవులు ఆడే కోలాటంలో
ఊహలు గుసగుసలాడుతుంటే
సరికొత్త ప్రణయ కావ్యానికి
ఊపిరినై ఊహాలోకంలో
నా ఇష్ట సఖుని కౌగిలిలో
కరిగి పోయితిని.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!