అంశం: చీకటి వెలుగులు
కార్తీకమాసం
రచన:పద్మజ రామకృష్ణ.పి
అమావాస్య చీకటిని
పారద్రోలుతూ వచ్చింది
రంగురంగుల చీకటి వెలుగుల
రంగేళి ఈ దీపావళి
కోటి కాంతులను విరజిల్లుతూ
అజ్ఞానాంధకారాన్ని తొలగించి
విజ్ఞానమనే వెలుగును ప్రసరించి
తెచ్చింది అందరిలో విజ్ఞతను
పెద్దల నవ్వులు మతాబులై
పిల్లల అల్లరి చిచ్చుబుడ్డిలై
ఉవ్వెత్తున పండగ కాంతులు
అందరిలో ఆనందాలు నింపాలి
కార్తీక శోభను సంతరించుకుని
శివాలయాల యందు భక్తి శ్రద్ధలతో
వెలగాలి ఆధ్యాత్మిక జ్యోతులు
నిండాలి ఇంటింటా సిరిసంపదలు
ఉసిరిచెట్టు నీడలో ఆరాధనకు
కొలువై ఆ పరమాత్మ పరవశించి
పునర్జన్మ లేని పుణ్యాన్ని
ప్రసాదించి పునీతుల్ని చేసే
ఈ పుణ్యకాలం కార్తీకమాసం