నా ప్రేమ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: క్రాంతి కుమార్
దేవతలా నిన్ను ఆరాధించలేకున్నా
హృదయ కోవెలలో రాతి బొమ్మగా నిన్ను పూజించలేక!
యువరాణిలా నిన్ను చూసుకోలేకున్నా
అందమైన ప్రేమ కోటలోనే నిన్ను బంధించలేక!
బంగారమని నిన్ను పిలవలేను
వజ్రంలాంటి స్వచ్ఛమైన నీ వ్యక్తిత్వాన్ని గుర్తించాక!
చల్లని వెన్నెలతో నిన్ను పోల్చలేను
క్షణమైనా నిన్ను చూడకుండా ఉండలేక!
ప్రకృతిలోని సోయగాలతో నిన్ను వర్ణించలేను
కనులు కాంచని నీ అంతః సౌందర్యం తెలుసుకున్నాక!
గుభాళించే ఆ పూల పరిమళంతో నిన్ను వర్ణించలేను
మత్తైన నీ మాటల సోయగం విలువను తగ్గించలేక!
నువ్వెలా ఉన్నా
నిన్ను నీలాగే ఇష్టపడగలను!!
ఒక్కసారి నీకు మనసిచ్చాక
మనసారా నిన్ను ప్రేమించాక..!!
chala బాగుంది క్రాంతి