ప్రకృతిపై పశుత్వం

ప్రకృతిపై పశుత్వం

రచయిత :: బొప్పెన వెంకటేష్

ప్రకృతమ్మ పచ్చల హారాన్ని తుంచారు
చెట్టూ చేమను గట్టూ గుట్టను కూల్చారు
చల్లనమ్మ తలాన్ని తలదన్నుకుపోయారు
ప్రకృతి ప్రకోపానికి కారణమయ్యారు
అవని అమ్మ ఒడిలో ప్లాస్టిక్ వ్యర్ధాలను పోశారు
భూ ఉష్ణ వృద్ధికి ఉరకలు వేశారు
వరద ముంపులను కొని తెచ్చారు
నవణీకరణ నమూనాలు ప్రకృతి విపత్తు మూలాలు
ప్రపంచీకరణ పేరుతో ప్రకృతి వినాశాలు
అడవి తల్లి పొదరింటిలో అగ్గి మంటలు రగిల్చారు
పుడమితల్లి గొంతు నులిమి వేశారు
ప్రాణవాయువు అందక పటపటా రాలిపోయారు
మహమ్మారి విపత్తుకు బలయ్యారు
అతివృష్టి అనావృష్టి అల్లకల్లోలాలకు ఆహుతి అయ్యారు
రొష్టు వాయువుల రంగులద్ది
భూతల్లి ఓజోన్ చీరకు చిల్లులు పొడిచారు
విషపు వాయువులతో వెతలు తెచ్చారు
వన వీధులలో
రంపపు రణగొణ ధ్వననులు
చేసారు
వనదేవత వేణువులూదే స్వచ్ఛ వాయువును
గంగా మాత అమృత జలధారను
రసాయనాల హంగులతో రొచ్చు చేశారు
కర్మాగారపు మలినాలను యదేచ్ఛగా చిమ్మారు
అవని తల్లి ప్రసాదాన్ని మఖిలి పట్టించారు
వనరులన్నీ ఇష్టారీతిన వొంపుతున్నారు
ప్రకృతి ధర్మాన్ని కాల రాశారు
వికృత చేష్టలతో విపత్కాకార్యాలు సృష్టించారు
ఇక తేరుకో ఓ మానవా మేలుకో ఓ మానవా
ఇకనైనా మానవా అడవి తల్లిపై ఆకృత్యాలు
ప్రకృతిని మళ్ళీ ప్రక్షాళన గావించాలి
ప్రతి అడుగు ప్రకృతి సుదిశగా పాటుపడాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!