జ్ఞాపకాల పిట్ట

జ్ఞాపకాల పిట్ట

రచయిత :: జయసుధ కోసూరి

నీలాకాశపు నింగిలో..
పరుచుకున్న వెన్నెల సాక్షిగా..
నీకోసం వెతుకుతూ..
నెలవంక కన్నుగా జేసుకొని..
పెదాలపై నీపాటను పూయిస్తున్నా.. !!
ఓ సంధ్యా సమయాన నీవొచ్చిన జ్ఞాపకం..
మల్లెలతేరుపై మధూలిక పరిమళమై..
ఆ పురాతన పరిచయపు వాసనేదో గాఢంగా తెలుస్తూనే వుంది.. !
మనిద్దరికీ తప్ప ఎవరికీ తెలియని రహస్యం..
వినగలిగితే..
ఆ నిశ్శబ్దం..
నీలాకాశంలో నింగి అంచున మ్రోగే ఢమరుకం.. !
పెదవి గడియ తీసి, చెవి కన్నుగా మారి వినిపిస్తోంది మన గతం.. !
నీవు నా ఆకాశమైతే..
నేనెప్పటికీ తారనే.. !
అలుపులేని అలనే.. నీ ఎద సాగరతీరం చేరే వరకూ.. !
జరుగుతోంది మన మనసున యుద్ధం..
గెలువుఎవరిదైనా మనసుబాధ ఇద్దరిదీ.. !
గతించిన అనుభవాల సాక్షిగా..
ఎగురుతున్నా జ్ఞాపకాలపిట్టనై.. !!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!