నిర్లక్ష్యంగా చేసే ప్రతీ పని ప్రమాదమే

(అంశం:” ప్రమాదం”)

నిర్లక్ష్యంగా చేసే ప్రతీ పని ప్రమాదమే

రచన::శృంగవరపు శాంతికుమారి

ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వచ్చి
నిండు ప్రాణాలను బలితీసుకొనునో
వికలాంగులను చేసి జీవితాంతం శోకసంద్రంలో
ముంచివేసెనో ప్రమాదం!
అనూహ్యరీతిలో మానవ మనుగడను చిందరవందర చేసెను ప్రమాదం!
భద్రతలు పాటిస్తూ
రోడ్డుపై పయనించే ప్రయాణికుడిని మృత్యుఒడిలో చేర్చిన ప్రమాదం!
నవ్వులను ఏడ్పులను, సుఖ సంతోషాలను విషాదాలను చేసెను ప్రమాదం!
కలుషితమైన ఆహారం ప్రమాదం!
ఇతరులను బాధ పెట్టే మాట ప్రమాదం!
హద్దులుదాటే నిర్లక్ష్య వైఖరి ప్రమాదం!
భద్రతలేని ఆడపిల్లలకు
భృణహత్యలు నుండి మొదలుకొని మానభంగహత్యలు వరకు
అడుగడుగునా ఎదురయ్యేను ప్రమాదం!
దుమ్ము ధూళి కణాలను
ప్లాస్టిక్ వ్యర్థపదార్ధాలను
ఉపేక్షించడం ప్రమాదం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!