(అంశం:” ప్రమాదం”)
జీవితంలో ప్రమాదం
రచన::ఎన్. రాజేష్
సరిగాచదువు చదవనిచో భవిష్యత్ ప్రమాదం
తప్పటడుగుల జీవితం
ఉన్నతికే ప్రమాదం
కాలాన్ని నిర్లక్ష్యం చేయడం
జీవితంలో పెను ప్రమాదం
హద్దులు లేకుండా పరుష పదజాలం ఎంతో ప్రమాదం
ఒంటి నిండా అహంకారం
మరెంతో ప్రమాదం
పెద్దల పట్ల లెక్కలేనితనం
అత్యంత ప్రమాదం
మిత్రులను కలిగి ఉండక
పోవడం పెంచు శత్రువుల
ప్రమాదం
బంధువులతో వైరం
చెప్పలేని ప్రమాదం
నీకంటూఉన్నారనినలుగుర్ని సంపాదించుకోలేకపోవడం
జీవితానికే ప్రమాదకరం!!