ఆపద అంచున

(అంశం:” ప్రమాదం”)

ఆపద అంచున

రచన::పి. వి. యన్. కృష్ణవేణి

గాలిలో దీపం పెట్టి మనము
నీవే దిక్కు దేవుడా అంటున్నాము ప్రమాదం సంభవిస్తే తలరాత అని భావిస్తున్నాము
ఆపదలు ముంచుకొస్తే ప్రకృతిని నిందిస్తున్నాము

ఎదురు తిరగలేని పరిస్థితి మనది ఎదుర్కొనక తప్పని ఆపద ఇది
ప్రకృతి బీభత్సం సంభవించే తరుణమిది
ఆపద అంచున ప్రయాణం మనది

చెట్లను కొట్టేసి, ఫ్యాక్టరీలను
నెలకొన్నాము
డబ్బులు పోసి గాలిని కొంటున్నాము
విలువ లేని జీవితాలు మనవేమో
జీవించక తప్పని బతుకులు మనవే

అయ్యో అనే వారు కరువయ్యెను
ఆదుకునే వారు కనుమరుగయ్యెను
రేపటి పరిస్థితికి కలువరమయ్యెను
కంటికి కునుకు దూరమయ్యాను

ఎప్పటికి మారును ఈ లోకం తీరు
తినే తిండి కూడా కొరత అయ్యెను
కంటికి కనిపించని జీవి, మన జీవితంతో ఆడుకునేను
మన జీవితమే అగమ్యగోచరమయ్యేను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!