మనసును మించి..

మనసును మించి

రచన::సత్య కామఋషి ‘ రుద్ర ‘

మనసును మించిన ఖైదు
ఏచోట కలదే మరి..?
తలంపుల కన్నా  బలమగు
బంధనాలు ఎచట కలవే..!

మనసు కన్న వేగమగునది
ఏమున్నదే ఈ జగతిలో
నీ తలంపుల కన్న మిన్నగు
రెక్కలు ఏచోట కనలేవే..!

మనసు అందుకోలేని అంచులు
ఎంతెంత ఎత్తునైనా కలవా.?
మరి తలంపులకన్న ధృడమగు
ఏ సోపాన పథము కలదే..!

మనసు చూరగొనలేని లోతుల
జాడ ఎవరు కనుగొన్నారని.?
ఏడేడు మహాసంద్రాల లోతైనా
దానికి సునాయాసపు దిగదుడుపే.!

మనసు చదవలేని ఏ భాషనైనా
ఏ లిపిన ఎవరు వ్రాయగలరే..?
ఏ భాష లేని నిగూఢ మౌనముల
పరమార్ధాలు దానికి సులువు కాదే..!

మనసును మించిన ఏ ఆప్తుడైనా,
ముంచు ఏ విరోధియైనా..!
మంచి చెడుల తారతమ్యములు
తెలుపుచూ, కృంగుబాటుల
పొంగుబాటుల ఏ ఘడియలైనా,
మనసుకాక మలి ఏ తోడు నీదని..!

మనసును మించిన కలిమి,బలిమి
ఏ బలహీనత ఏమున్నది ఎవరికైనా.!
మనసు మించిన ఏ శక్తి కలదే జగతిన
నిన్ను నీవైనా, ఏదేని గెలిచేందుకైనా..!

You May Also Like

2 thoughts on “మనసును మించి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!