నేచెప్పిందేమంటే..

నేచెప్పిందేమంటే..

దోసపాటి వెంకటరామచంద్రరావు

నేను చెప్పింది వింటావా?!
అయితే విను..
ఏమిటి వినవా..
సరేలే….నువ్వు విను వినకపో
నేను చెప్పితీరుతాను…
నేచెప్పిందేమిటంటే…
నీచుట్టూ జరుగుతున్నదేమిటో గమనించు…
నీ వారెవరో పరాయివారెవరో తెలుసుకొ…
నీకుచేతనైతే సహాయం చెయ్యి…
నీకుచేతకాకపోతే ఊరుకో..
నీవు ఎవరికీ సలహాలివ్వకు..
నీ మాటలు ఎవరూ వినటంలేదా..
నోరుమూసుకొని వుండు..
ఎవరిని కష్టపెట్టకు..
ఎవరిని హింసించకు..
నిన్ను హింసించినా ..కష్టపెట్టినా ..వూరుకోకు
తిరగబడు…ధౌర్యే…సాహసే..నీకు తోడు
విన్నావా….వినపడలేదా….వినిపించుకోలేదా…
అయితే నీఖర్మ!నేనేమి చేయలేను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!