ప్రపంచ అద్భుతాలు

అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు

ప్రపంచ అద్భుతాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

మనకు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని ఈ వ్యాసంలో తెలుసుకొందాం.
“జి యస్ విగ్రహం”
క్రీ. పూ 5వ.శతాబ్థంలో గ్రీసు దేశాన్ని “సెరిక్లిజ్” అనే గొప్ప వీరుడు పరిపాలించాడు. ఆయన పరిపాలనా కాలం ఎథెన్స్ నగర చరిత్రలో స్వర్ణయుగంగా పేరు గాంచింది.
గ్రీకు మహశిల్పి ఫిడియస్, ఆ కాలంలో నివసించాడు. ఫిడియస్ మొదట బంగారు- దంతం మిశ్రమంతో “60 అడుగుల ఎత్తయిన ఎథీనా దేవత విగ్రహాన్ని” సృష్టించాడు. ఆ విగ్రహం, ఏథెన్స్ నగర మధ్యలో కొండ మీద వున్న సుప్రసిద్ధి పార్తినాన్ దేవాలయంలో ప్రతిష్ఠంచబడింది.
ఒలంపిక్ మందిరంలో ప్రతిష్ఠంచడానికి ఫిడియన్ రూపొందించిన మరొక బ్రహ్మాండమైన బంగారం – దంత విగ్రహం జియన్! మనిషి ఎత్తుకు పందింతలు పెద్దదైన ఈ బ్రహ్మండమైన విగ్రహాన్ని ఏడు ప్రపంచపు వింతలలో ఒకటిగా ప్రాచీనులు భావించేవారు.
తరువాత మరొకటి “డాన్ దేవాలయం” ఆసియా మైనర్ పశ్చిమ సముద్ర తీరంలో ఒకప్పుడు సుసంపన్నమైన “ఎఫిసస్ నగరం” ఉండేది. నగర మధ్యలో వెలసిన డాయానా దేవాలయం కారణంగా ఆ నగరం మరింత ప్రసిద్ధి గాంచింది (గ్రీకులు ఈ దేవతను ఆర్తీమెన్ అని పిలిచారు. ఎఫిసస్ ప్రజలు దాదాపు 220సం// శ్రమించి, ఈదేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. దురదృష్టవశాత్తు రోమను చక్రవర్తి నీరొ దేవాలయాన్ని ముట్టడించాడు. క్రీ. శ. 262వ సం//లో గోథ్ లు దీనిని సర్వ నాశనం చేశారు.
ఇంకోటీ “హాలికార్నాసస్” స్మారక మందిరం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం ఈ జీయర్ సముద్ర తీరంలో హాలికార్నాసస్ అనే అందాల నగరం వుండేది. అది గ్రీకులు నివసించిన ప్రాంతం. నగరంలో కారిక్ రాజు మౌపోలస్ సమాధి మీద అతని భార్య అర్టమీసియా రాణి బ్రహ్మాండమైన మందిరం నిర్మించింది. స్మారక మందిరానికి ఒక్కొక్క వైపు మూడు వందల అడుగుల పొడవు గల గట్లు (ఎస్వననేడ్) వుండేవి. ఈ బ్రహ్మాండమైన భవనం ఆనాటి ఏడు ప్రపంచ వింతలలో ఒకటిగా పేరు గాంచింది. క్రీ. పూ. 4వ శతాబ్థంలో నిర్మించబడిన ఈ స్మారక భవనాన్ని క్రీ.శ. 4వ.శతాబ్దంలో తురుష్కులు నేల మట్టం చేశారు.
మరొకటి “అలెగ్జాండ్రియా లైట్ ల్ హౌస్” షారోస్ ద్వీపంలో అలేగ్జాండ్రియా నగర సమీపంలో ఫిలాడెఫిన్ నిర్మించిన బ్రహ్మాండమైన దీప స్తంభం ఉండేది. ఇది క్రీ.పూ. 3వ శతాబ్దంలో నిర్మించబడింది. తెల్లటి పాలరాతితో అనేక అంతస్తులుగా నిర్మించబడిన ఈ కాంతి గృహం పై అంతస్తులో కింది వాటికన్ చిన్ని 520 అడుగుల ఎత్తు కలిగిన ఈ దీప స్తంభం మీద మంటవెలుగు సముద్రంలో 30 మైళ్ళు దూరం కనిపించేది. భూకంపాలూ, సముద్రపు అటూ పోట్లు ఈ వెలుగు మందిరాన్ని క్రమ క్రమంగా హరించేశాయి. అయినా 13వ శతాబ్దం వరకు దీని శిధిలావశేషాలు ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయి.
ఇంకోటి “చైనా మహాకుడ్యం” వ్యోమగాములు ఆకాశంలోకి దూసుకు వెళ్ళిప్పుడు, భూమి మీద కొండలూ సముద్రాలు నగరాలూ లీలగా కనిపిస్తూ క్రమ, క్రమంగా కనుమరుగవుతాయి. బహుశా అలా చిట్టచివరగా కనుమరుగయ్యే మానవనిర్మిత కట్టడం చీనామహాకుడ్యం.1500 మైళ్ళ పోడవు (అంటే భూమిచుట్టు కొలతలో ఇరవయ్యో వంతు) గల ఈ మహాకుడ్యమే మనిషి నిర్మించిన కట్టడాలలో కల్లా బ్రహ్మాండమైనది. దీనిలో 24,000 ద్వారాలూ శిఖరాలూ ఉన్నాయి దీని సగటు ఎత్తు 25అడుగులు కింది భాగంలో 20–30అడుగులూ పైన15 అడుగులు వెడల్పు గల ఈ గోడ మీద ఒకేసారి పలువురు రౌతులు గుర్రం మీద స్వారి చేయవచ్చు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో షాన్ హ్యంగ్ టీ చక్రవర్తి ప్రారంభించిన దీని నిర్మాణం 1700సం//రాల పాటు కొనసాగింది. మింగ్ వంశపురాజు కాలం (1368-1644)లో దీనికి తుది మెరుపులు దిద్దారు.
మరొకటి “ఈస్టర్ ద్వీపం విగ్రహాలు”! దక్షిణ పసిఫిక్ సముద్రంలో వున్న ఈస్టర్ ద్వీపంలో వరుసగా కొన్ని బ్రహ్మాండమైన విగ్రహాలు వున్నాయి. వీటి ఎత్తు 3 అడుగుల నుంచి 36అడుగుల వరకు ఉంటుంది. వాటిలో ఒక విగ్రహం 66 అడుగుల ఎత్తు ఉన్నది. అవి 86 టన్నులవరకు వున్నవి!
ఆ విగ్రహాలు అగ్ని పర్వత సమీపంలో ఉన్నాయి, అవి అక్కడకి ఎలా తీసుకురాబడినవి? వాటిని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారు, అనే విషయాలు ఇంకా గూఢంగానే ఉన్నవి. ఆధునిక శాస్త్రవేత్తలు ఎవరూ వాటి రహస్యం తెలుసుకోలేకుండా వున్నారు! ఈ వ్యాసంలో మరొకటి చెప్పుకొందాం.
“రోడ్జ్” బ్రహ్మాండమైన విగ్రహం! రోడ్జ్ రేవు ముఖద్వారంలో బ్రహ్మాండమైన సూర్య (అపోలో) విగ్రహం ఒకటి ఉండేది. ఛార్స్ అనే గొప్ప శిల్పి కారుడు 12సంవత్సరాలు కృషి చేసిన కాంస్య విగ్రహాన్ని “సృష్టించాడు.
రేవు ముఖద్వారం లో ఆ విగ్రహం ఉండేదని, ఆ బ్రహ్మాండమైన విగ్రహం కాళ్ళ మధ్య నుంచి ఓడలు వెళ్ళేవని ఆ విగ్రహం చేతిలో పెద్ద జ్యోతి ఉండేదని చెబుతారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో ఏర్పడిన ఒక భూకంపం వల్ల ఆ విగ్రహం చిన్న భిన్నమయింది.! మనకు ఇలాంటి అద్భుతాలు తెలియకుండానే ప్రపంచంలో మరేన్నో ఉన్నాయని పూర్వీకులు అంటుంటారు.

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!