ప్రేమ ముల్లు
రచన: సుజాత కోకిల
ఓ సుందరి మీ వంటెే నా కెంతో ఇష్టం
నిన్ను చూసిన ఆ క్షణంలో
పరిమళాలు వెదజల్లిన వసంతంలా
వికసించింది నా మనసు నీ మాటలతో
నీ ప్రేమతో నీ దాసుడిగా చేసుకున్నావు
నీ ప్రేమలో మునిగిపోయాను మీ వంటెే
పడి చస్తాను నీవు లేకుంటే జీవితమే లేదు
పున్నమిలా నా జీవితంలోకి వచ్చావు
అమావాస్య చీకటిలా చేస్తూ వెళ్ళకు
నీ మాటలు గులాబీముళ్ళులా
గుచ్చుకున్న నీపై ఉన్న ప్రేమ తగ్గలేదు
బహుశా ప్రేమ అంటే ఇదేనేమో
ఒక్కసారి మనసు ఇచ్చాక మళ్లీ వెనక్కి
తీసుకోలేం చంద్రబింబం లాంటి నీ మోములో
వెన్నెలలా కురిపించే నీ చిరునవ్వు
కోయిల పాడిన పాటల నా మనసును
తట్టి లేపావు ఇప్పుడు ఎందుకు చెప్పు
మొహం తిప్పుకుంటూ వెళుతున్నావు
చెప్పు సుందరి ఏమైంది.నా మనసును
ముక్కలు చేయకు ఈ ప్రియుడి ప్రేమను
అర్థం చేసుకో ఎన్నడూ నాచేయి విడిచివెళ్లకు