వంశవృక్షం

వంశవృక్షం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :  కందర్ప మూర్తి

వంశవృక్షంకు నాన్న బీజం వేస్తాడు
అమ్మ మొక్క గా మొలిపిస్తుంది
నాన్న నీళ్లు పోస్తాడు
అమ్మ ప్రేమతో పెంచి మాను కట్టిస్తుంది
మాను కట్టిన వృక్షం పుష్పించి  ఫలాన్నిస్తుంది
ఫలించిన వృక్షం ఊడలు కట్టి బలాన్నిస్తుంది
పచ్చగా ఫలించి పుష్పించిన వృక్షం పక్షులకు
ఆవాసమౌతుంది
వృక్షం విశాలంగా విస్తరించి అవనిపై పరుచుకుంటుంది
నివాస పక్షులు కాలగమనంలో నశిస్తే
కొన్ని  వలస పోతే, మరికొన్ని ఆవాసాని కొస్తాయి
మూల వృక్షం మాను కట్టి మోడై నసించినా
కొత్తగా మొలిచిన బీజాలు తిరిగి మొక్కలై
మాను కట్టి పచ్చని వృక్షమై  కాల చక్రంల
పయనిస్తూ మరి కొన్నిటికి జన్మనిచ్చి
వంశ వృక్షాన్ని కలకాలం నిలబెడుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!