చదువుల మాయ!

చదువుల మాయ!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

“చదవడానికి ఎందుకురా తొందర? ఎదర బతుకంతా చిందర వందర,”
అన్న వాక్యాలు అక్షర సత్యాలు.
‘విద్యారంగం లో ఎన్ని లోటుపాట్లు జరిగిన,
ఉపాధ్యాయులు సవరించడానికి కూడా వీలు లేని పరిస్థితి,
రెండున్నర సంవత్సర వయసులోనే బాలులను బలవంతంగా, క్రెచ్ లోకి పంపించి, తల్లిదండ్రులు, ధనార్జన కోసం,
అమూల్యమైన బాల్యాన్ని హరించే విధానమే మారాలి.!!
డొనేషన్ పెడితే గాని, కార్పొరేట్ స్కూళ్లలో
అడ్మిషన్ రాదు, గవర్నమెంట్ స్కూల్లో
చదువు అంతంత మాత్రమే,
తల్లిదండ్రులు, రాత్రి పగలు పెద్ద ఉద్యోగాల కోసం, కుటుంబాలను వదిలి,
తమ పిల్లలను ఐఏఎస్ లు, ఇంజనీరింగ్లు, మెడిసిన్ లు, చదివించడానికి నాన యాతన పడుతు,
చివరకు పెద్ద ఉద్యోగాలలో స్థిరపడి తల్లిదండ్రులను అనాధాశ్రమాలకు, తరలించే దుస్థితి మారాలి,
కుటుంబ వ్యవస్థ ఉద్ధరింపబడాలి,
స్వతహాగా ఎక్కడ చదివినా, తమ తెలివితేటలతో, రాణించి తల్లితండ్రులను అనుక్షణం కాపాడుతూ,
చదువు నేర్పిన గురుదేవతలను గౌరవించిన నాడే
మన దేశ సౌభాగ్యం పేద గొప్ప, తేడా లేకుండా ప్రపంచంలోనే, అత్యుత్తమ విద్యాధికులు ఉద్భవించి
మన దేశం పురోగతిని సాధిస్తుంది.
కౌమార దశ లో, అంతర్జాల’ పాఠ్యాంశాలకు అలవాటు పడి, బాలురు తమ స్వశక్తిని కోల్పోయి,
ఉపాధ్యాయులు చెప్తున్న పాఠాలను కూడా పెడచెవిని పెట్టి నిముషంలో జవాబులు చెప్పే చరవాణి ఆశ్రయంతో
గూగులమ్మ తల్లికి అలవాటుపడి, పరీక్షలు రాయడంతో, భగవంతుడు ఇచ్చిన తెలివితేటలను మరిచిపోయి,
నిర్లక్ష్య ధోరణితో, బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు.
“ఓ యువతీ యువకుల్లారా, బాలబాలికల్లారా,! ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలను,
తమ స్వశక్తితో అర్థం చేసుకుని ఎంతో ఎత్తుకు ఎదగాలి.
విద్యా విధానాలను, ఉపాధ్యాయులను తల్లిదండ్రులతో పాటు గా గౌరవించిన నాడే
చదువుల తల్లి “సరస్వతీ కటాక్షం” లభించునని విద్యార్థినీ విద్యార్థులకు, నా  మనవి.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!