వర్ణణాతీతం

(అంశం::” ప్రేమ”)

 వర్ణణాతీతం

రచయిత :: జీ వీ నాయుడు

అది చెన్నై లోని పచ్చయప్పన్ కాలేజీ. ఇక్కడ పీజీ విభాగం లో తరగతి గదిలో విద్యార్థులు అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ఒకే బెంచ్ లో కలసి కూర్చుంటారు. మన తెలుగు వారికి అది పెద్ద వింత.. వినోద్ అనే అబ్బాయి రోజ్ అనే అమ్మాయి ని రోజు గమనిస్తున్నాడు.. ఒక వారం గడిచింది.ఆ అమ్మాయి పక్కన కూర్చోవడం మొదలుపెట్టారు.. రెండు, మూడు రోజులు అలా గడిచింది. ఆ అమ్మాయి సాదారణంగా మొదటి వరుస బెంచీలో కూర్చోవడం అలవాటు. రోజ్ కాలేజీ కి ఆలస్యం గా రావడం అప్పటికే ఫుల్ అయిన బెంచ్ లో సర్దుక పోవడం చేస్తుంది.రోజ్ స్కూటి లో వస్తుంటే ఒక రోజ్ వినోద్ తన బైక్ ను అడ్డం పెట్టాడు.. అయినా రోజ్ సైలెంట్ గా తప్పుకొని వెళ్ళింది. రెండు రోజుల తరువాత ” హలో మేడం. ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యు ” అంటూ వినోద్ మాటలు కలిపే ప్రయత్నం చేసాడు. ” కీప్ క్వాయిట్ స్టుపిడ్, థిస్ ఇస్ ఏ డిసైప్లైనడ్ కాలేజ్ ” అంటూ ఓ వార్నింగ్ ఇచ్చినట్లు బదులిచ్చి ఫోర్స్ గా వెళ్ళింది రోజ్ తరగతి గదిలోకి.
ఇక లాభం లేదు. ఈ పిల్ల పడదు. దీంతో వెస్ట్ అనుకోని తనలో తానే తిట్టుకుంటూ ఉన్నాడు వినోద్. ఒక రోజు తన ఫ్రెండ్ గోపితో మాట్లాడుతూ ఇలా అన్నాడు వినోద్. ” మన క్లాస్ లో ఆ రోజ్ ను ఎలా అయినా లవ్ చెయ్యాలి. పీజీ అయ్యే లోపు పెళ్ళి చేసుకోవాలి.. ఓ రూట్ చెప్పు గురూ ” అంటూ ప్రాధేయ పడ్డాడు. గోపికీ ఏమి చెప్పాలో అర్ధం కాక తలపట్టుకున్నాడు.
రోజ్ కాలేజీ బ్యూటీ. ఆ పిల్లను లవ్ చెయ్యని వాడే ఈ కాలేజీలో లేడు. ఎవరికీ వారు మనసులో ఆ పిల్ల తో మాట్లాడాలని పడే తపన వర్ణణాతీతం. రోజ్ ఎవ్వరితో మాట్లాడదు. అయితే అందరు ఆ పిల్ల కావాలి అనుకునే వారే. ఒక అబ్బాయి పేరు ఉస్.. మాత్రం తను పని తాను చేసుకుని వెళ్తుంటాడు. ఎవర్నీ పట్టించుకోడు. రోజ్ అతను ఫ్రంట్ బెంచీలో ఎక్కడ ఉన్నా, వెతికి మరీ ఆ అబ్బాయి దగ్గర కూర్చొని కేవలం సబ్జెక్టు మాత్రమే మాట్లాడుతుంది.
వినోద్ అల్లరి ఎక్కువైంది.
రోజ్ ఎక్కడ కనిపించినా ” ఐ లవ్ యూ ” అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ అదో లాగా చూస్తుండే వాడు.. ఒక రోజు తను పధకం ప్రకారమే కాలేజీ కి ముందుగానే వచ్చింది..గ్రౌండ్ లో ఉన్న వినోద్ ఆ అమ్మాయి రాకను గమనించి ” అమ్మయ్య.. ఈ రోజు పండుగ.. ఈ పిల్ల ఏమిటీ.. ఈ టైములో రావడం ఏమిటీ.. అంతా వింతగానే ఉంది. ఈ రోజు ఎస్ ఆర్ నో ఏదో ఒకటీ తేల్చి వెయ్యాలి ” అంటూ పరుగు తీసాడు తరగతి గదిలోకి..
” ” హాయ్.. మేడం. గుడ్ మార్నింగ్.. నీతో ఏదో మాట్లాడాలి అని ఉంది. నీకు సరిగా తెలుగు రాదు.. నాకు ఇంగ్లిష్ అంతంత మాత్రం ” అంటూ పక్కన కూర్చున్నాడు.
” ఏమి దా అయింది చెపు.. నీకు దా ఏమి దా కావాలి ” అంటూ రోజ్ వచ్చి రాని తెలుగులో చెప్పింది.
అంతే సంతోషం పట్టలేక వినోద్ ” ఐ లవ్ యు ‘ అంటూ పక్కన కూర్చున్నాడు. “”ఆడ పిల్ల అంటే అంత చులకనా.. నువ్వు లవ్ చేస్తే నేను చెయ్యాలా.. నాకు మనసు ఉండదా.. అసలు నీకు లవ్ గురించి ఏమి తెలుసు…ఇంకో సారి నా దగ్గర కూర్చున్నావో.. లవ్ గివ్ అన్నావో.. నేను ఏమిచేస్తానో తెలియదు.. నేనూ కరాటే, కుంఫు లో బ్లాక్ బెల్ట్… తస్మాత్ జాగ్రత్త.. ఎము కులు కూడా మిగలవు… అందమైన ఆడపిల్లలు కనిపిస్తే చాలు…” అంటూ తీవ్ర స్వరంతో వార్ణింగ్ ఇచ్చింది. క్లాస్ లో ఇంకా ఎవరు రాలేదు
ఒక్కసారి గా వినోద్ ను భయం ఆవరించింది. ” గట్టిగ కాళ్ళు పట్టుకుంటా ” అంటూ లేచాడు వినోద్.. ఇంతలోనే ఎవరో స్టూడెంట్ రావడంతో రోజ్ శాంతించింద

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!