నా మొదటి ప్రేమలేఖ

నా మొదటి ప్రేమలేఖ

రచన: పుష్పాంజలి

నిన్ను కలిసిన వేళ  నాకు తెలియదే
మన నడుమ ఇంతా బంధం  వుంటుందా ?

నిన్ను  పట్టించుకోని నాకు
నీ తొలి పలుకులు విన్నా వేళా …..

ఆకాశములోని  తారాకలన్నింటిని
ముాటగట్టి నీ దోసటా నింపనా అన్నావేళా……

ఎవరిని కన్నులు ఎత్తి  చుాడని నేను
నా చిత్తం  నీ పలుకులకే
పరవశము చెంది , నీ గాత్రము విన్నా
నన్ను నేను మరిచితినే  కదా.
అని ప్రశ్న  వేదించగా మరి
అవును అందునా కాదు అందునా ?
నీ అల్లరి చుాపులు గిలిగింతులకు
నే తాళాలేను ……….

నా  కలలో  నీవే చేసే అల్లరిని
ఏమని చెప్పను ? ఎంతాని వర్ణించను?
నీ కరముల స్పర్శతో  నా మేని పులికించగా!
నీ తియ్యని  పలుకులకై
నా మది  పరితపించిగా

నీ కళ్ళు  చేసే వింతకాంతులకు చిలిపి శేష్టాలకు  నాలో  రేగి ప్రేమపరవశమే ఎదో  ఉలికిపాటుతోనే కళ్ళు  తెరవగా నీ ఛాయ మాయమైయి  నాలో
ఈ వింతా  భావములును  అక్షరాలగా  కూర్చి పంపుతున్నా లేఖా సందేశమై  నావెచ్చని శ్వాశలతో  నీతో ఉసులాడే వేళ ఎప్పుడు
అని ఎదురు చుాస్తుా  నీ  నెచ్చాలి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!