ప్లాస్టిక్ నవ్వులు

ప్లాస్టిక్ నవ్వులు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

సువాసనలులేని పువ్వులు
అందంలేని రంగుల గులాబీలు
సుకుమారం తెలియని కుసుమాలు
నీ దరిచేర నీయకు ఆ ప్లాస్టిక్ పూలు

వీలువ ఇవ్వని సహవాసులు
విలువ ఎరుగనివారి భందాలు
ఉపయోగంలేని మనుష్యులు
ఎన్నటికీ నీ మదికి చేరుకాలేరులే..

నా చుట్టూ అల్లుకున్న ప్లాస్టిక్ నవ్వులు
దూరమైపోయిన ప్రేమానురాగాలు
స్వార్ధం అలుముకున్న మనసులు
ఇవి మనం జీర్ణించుకోలేని నిజాలు

చదువుల్లో ఓనమాలు తెలియని పిల్లలు
నలుగుదురు నీ స్వార్దపు జ్వాలలు
జీవంలేని మానవ పలకరింపులు
మరపుకు రావలెను ఎన్నో సంఘటనలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!