జీర్ణించుకోవడం

జీర్ణించుకోవడం

రచన: జ్యోతిరాణి

అంతేనా!..నువ్వు నేను బంధానికి
నీవుగా ఇచ్చిన కానుక నిశ్శబ్దం
కంటికి కన్నీరుకి మధ్య దూరం తగ్గి
చెక్కిళ్ళను పలకరించిన ప్రతిసారి
ఇదేనా ప్రేమంటే అని…మనసు ప్రశ్నిస్తుంటే
మనసుపొరలలో నేనుగా దాచుకున్న ప్రేమ
ప్రేమసంద్రంలో కదాలడుతున్నప్పుడు
ఒకసారి అలవై పొంగి ఒడ్డున విసిరికొట్టిన
చేపపిల్లలాగా మనసు గిలగిలా కొట్టుకుంటుంది..
నన్ను కాసిన్ని ప్రేమనీళ్లు పోసి నీ హృదయమందిరంలో
నన్ను బ్రతికిస్తావో లేక అలాగేవదిలేస్తావో
తెలియకున్నది మనసా…
ప్రేమకు అర్ధాలు నిస్వార్ధంఅని నేను..
ప్రేమంటే..
అది ఒక అంతులేని సాగరం
ఎవరు అందించలేని పరిమళాలఅమృతం
చల్లగా మనసుని తాకే మనసుగాలి
నేనున్నానంటూ అక్కున చేర్చుకొని పొదరిల్లు
మోము పై విరపూసే అందమైన చిరునవ్వు
మాటలకు అందని అద్భుతభావన
ఊహలకు అందని హృదయప్రపంచం
హృదయాన్ని గెలిచిన ప్రేమ
ఎన్నటికీ మనసులోతులనుండి
పెకిలించిన దాని మూలలను
నీవు మర్చలేవుగా..నీ దూరం
నీ మౌనం అన్నింటినీ
జీర్ణించుకోవాలేమో నీ ప్రేమలో..

You May Also Like

One thought on “జీర్ణించుకోవడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!