స్వేచ్ఛాఫలాలు

అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ!?

స్వేచ్ఛాఫలాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: లగిశెట్టి ప్రభాకర్

మనమీనాడు అనుభవించే స్వేచ్చా ఫలాలు
ఎందరో అమరవీరుల త్యాగఫలాలు
ప్రాణాలొడ్డి సాధించుకున్న స్వాతంత్య్రం
అందరిని అలరించలేక పోతుంది
కొందరి కబంధ హస్తాల్లో నలిగిపోతుంది
అబలల ఆర్తనాదాల్లో ఆహుతవుతుంది స్వేచ్ఛ
తాము పండించిన పంటకు ధర నిర్ణయించుకునే
స్వేచ్ఛ లేక కృంగపోతున్న రైతన్న
నిరుపేదల వ్యధల్లో నలుగుతుంది స్వేచ్ఛ
నిరుద్యోగుల నిస్పృహల్లో నిలుస్తున్న స్వేచ్ఛ
అవినీతి,బంధుప్రీతి, కుళ్లు రాజకీయాలలో
లంచగొండితనం, చీకటిబజారులలో
అందలమెక్కుతున్న స్వేచ్ఛ
స్వేచ్ఛను హరించే శక్తులు నిర్మూలం కావాలి
స్వేచ్ఛా ఫలాలు సమంగా అందరికీ అందాలి
సమసమాజ నిర్మాణమే మన ధ్యేయం కావాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!