రోజూ నరకమే

(అంశం. :”చాదస్తపు మొగుడు”)

రోజూ నరకమే

రచయిత :: జీ వీ నాయుడు

ఇరవై ఏళ్ల యువతి కొత్త కోడలు
మెట్టినింత అడుగు పెట్టింది శుభవేళ
వయ్యారి నడకలు చూడముచ్చట గొలుప

రాత్రి వచ్చింది అంటే ఆ యువతి
చూస్తుంది ప్రతి రోజూ ఓ
నరకం

చెప్ప లేని నిస్సహాయితా
నిట్టూర్పులు
నవదంపతులు అయినా
అల్లంత దూరం

ఏమండీ ఈ రోజూ అంటుంది
పడతి
ఆదివారం సూర్యనారాయణుడు అంటాడు

మరి ఈ రోజూ సోమవారం
అంటుంది పడతీ
ఓం నమశివాయ అంటాడు
మొగుడు

మరి మంగళవారం వచ్చిందిఏమంటాడో
ఈ రోజు మంగళకరం అవుతుందా
ఓం శ్రీయాంజనీయం అన్నాడు మొగుడు

ఏమండీ శ్రీవారు వచ్చింది బుధవారం
ఓం గణాధిపతియే నమః
అన్నాడు మొగుడు

గురువారం వచ్చింది నేను
గుర్తు ఉన్నానా అన్నది
ఆ యువతి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అన్నాడు మొగుడు

శుక్రవారం అయినా కరుణిస్తాడేమో అనుకున్నదీ పడతీ
అమ్మోమ్మో పాపం లక్ష్మీ దేవికి
కోసం అన్నాడు మొగుడు

శనివారం వచ్చింది ఏదోఒకటి
చెప్పమంది
బాబాయ్ నాకు తగని పని
అది అన్నాడు

చాదస్తపు మొగుడూ. నీకెందుకు పెళ్ళి
నాశనం చేశావు బంగారు
బతుకుని అంటూ
పుట్టింటికి పయనం అయ్యే
ఆ పడతి పుట్టెడు దుఃఖం తో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!